BigTV English

Google Layoffs:సంక్షోభ నివారణకే తొలగింపులు: సుందర్ పిచాయ్

Google Layoffs:సంక్షోభ నివారణకే తొలగింపులు: సుందర్ పిచాయ్

Google Layoffs:ఉద్యోగుల తొలగింపు విషయంలో స్పష్టమైన, కచ్చితమైన, ముందస్తు నిర్ణయం తీసుకోకపోయి ఉంటే… సమస్య మరింత పెద్దదై పరిస్థితి చాలా దారుణంగా మారేదని వివరణ ఇచ్చాడు… గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. 12 వేల మంది ఉద్యోగుల తొలగింపుపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో… సిబ్బందితో అంతర్గతంగా నిర్వహించిన సమావేశంలో వివరణ ఇచ్చాడు… సుందర్ పిచాయ్. ఇప్పుడీ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే… ముందు ముందు దారుణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చేదని, దాన్ని నివారించడానికే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, ఆయన ఉద్యోగులతో వ్యాఖ్యానించారు.


కంపెనీ వృద్ధి నెమ్మదించిన నేపథ్యంలో… ఉద్యోగుల తొలగింపుతోనే పొదుపు చర్యలు ఆగిపోవని, బోనస్‌ల్లోనూ కోతలుంటాయని సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. బాధ్యతాయుత నాయకత్వ హోదాల్లో ఉన్న అందరికీ… ఈ ఏడాది బోనస్‌లు తగ్గుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇక, ఎక్కువ కాలం కంపెనీలో పని చేసి తాజాగా తొలగింపుల్లో ఉద్యోగం కోల్పోయిన వారికి… పరిహార ప్యాకేజీని సిద్ధం చేస్తున్నామని, ఆల్ఫాబెట్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ రుత్‌ పోరట్‌ చెప్పారు.

మరోవైపు… సుందర్ పిచాయ్ నిర్ణయంపై టెక్కీలు, ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. తాజా పరిస్థితికి సుందర్ పిచాయే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆల్ఫాబెట్ బోర్డు.. ముందు సుందర్ పిచాయ్ ఉద్యోగం పీకేయాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కంపెనీ ప్రస్తుత పరిస్థితికి తనదే పూర్తి బాధ్యత అని మాటల్లో చెప్పడం కాకుండా… ఉద్యోగానికి రాజీనామా చేసి చేతల్లో చూపాలని సుందర్ పిచాయ్ ని డిమాండ్ చేస్తున్నాయి. తప్పుడు నిర్ణయాలకు ఆయనే బాధ్యత వహించి మూల్యం చెల్లించాలని… సింపుల్‌గా కఠిన నిర్ణయాలకు చింతిస్తున్నాం అని చెప్పి తప్పించుకుంటే సరిపోదని వ్యాఖ్యానిస్తున్నాయి. ఇదే సూత్రం మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్లకు కూడా వర్తిస్తుందని అంటున్నాయి. గత త్రైమాసికంలో 17 బిలియన్‌ డాలర్ల లాభాలను ఆర్జించిన ఆల్ఫాబెట్… 12 వేల మంది ఉద్యోగుల్ని తొలగించడం ఆమోదయోగ్యం కాదన్న కంపెనీ వర్కర్స్ యూనియన్… ఈ నిర్ణయంపై టెక్కీలు సమిష్టిగా పోరాడాలని పిలుపు నిచ్చింది.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×