BigTV English

Heart Attacks : సూపర్‌మార్కెట్ ట్రాలీలు.. గుండెపోటును గుర్తిస్తాయి..

Heart Attacks : సూపర్‌మార్కెట్ ట్రాలీలు.. గుండెపోటును గుర్తిస్తాయి..
 trolleys detect heart attacks


Supermarket trolleys detect heart attacks : టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయ్యిందంటే చేతికి పెట్టుకునే వాచ్ ద్వారా మన గుండె కరెక్ట్‌గా కొట్టుకుంటుందో లేదో తెలుసుకోవచ్చు. వాచ్ మాత్రమే కాదు కళ్లకు పెట్టుకునే గ్లాసెస్, చేతిలో ఉండే ఫోన్.. ఇలా మనం ఉపయోగించే చాలావరకు గ్యాడ్జెట్స్ మన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండడానికి ఉపయోగపడుతున్నాయి. అదే విధంగా సూపర్‌మార్కెట్‌లో ఉండే ట్రాలీల ద్వారా కూడా గుండె సంబంధిత వ్యాధులను కనిపెట్టవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు.

తాజాగా సూపర్‌మార్కెట్ ట్రాలీలను ఈసీజీ (ఎలక్ట్రోకార్డియోగ్రామ్) సెన్సార్లతో తయారు చేయవచ్చని కనిపెట్టారు శాస్త్రవేత్తలు. ఇది గుండె కరెక్ట్‌గా కొట్టుకుంటుందో లేదో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఈ విషయాన్ని ముందుగానే కనిపెడితే హార్ట్ ఎటాక్ లాంటి ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. ఈ కండీషన్‌ను ఆట్రియల్ ఫిబ్రిల్లేషన్ అంటారని చెప్పారు. గత రెండు నెలలుగా వారు చేస్తున్న ఈ స్టడీలో ఆట్రియల్ ఫిబ్రిల్లేషన్ ఉన్న 39 మందిని వారు కనిపెట్టామని చెప్తున్నారు. అసలు వారికి ఈ కండీషన్ ఉన్న సంగతి వారికే తెలియకపోవడం గమనార్హం.


ఈసీజీ సెన్సార్ ట్రాలీల ద్వారానే 39 మందికి ఆట్రియల్ ఫిబ్రిల్లేషన్ ఉన్న విషయాన్ని కనిపెట్టినట్టు శాస్త్రవేత్తలు బయటపెట్టారు. దీన్ని బట్టి చూస్తే వారు చేసిన ప్రయోగాలు, వారి కనిపెట్టిన ఈ ఈసీజీ సెన్సార్ ట్రాలీలు సక్సెస్ అయినట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 మిలియన్ మందికి ఆట్రియల్ ఫిబ్రిల్లేషన్ కండీషన్ ఉంటుంది. కానీ అందులో చాలామందికి ఈ కండీషన్ గురించి తెలియదు. దాని వల్లే అనుకోకుండా హార్ట్ ఎటాక్స్ అనేవి సంభవిస్తుంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఆట్రియల్ ఫిబ్రిల్లేషన్ 5 రెట్లు ఎక్కువగా హార్ట్ ఎటాక్ రిస్క్‌ను పెంచుతుంది. చాలావరకు కేసుల్లో ఒక్కసారి గుండెపోటు వచ్చిన తర్వాతే వారికి ఈ వ్యాధి ఉన్నట్టుగా బయటపడుతుంది. అందుకే ఈ కండీషన్‌ను ముందుగా కనిపెట్టగలిగితే హార్ట్ ఎటాక్ వచ్చే రిస్క్‌ను తగ్గించవచ్చు. వారు తయారు చేసిన ఈ సూపర్‌మార్కెట్ ట్రాలీ ద్వారా ఆట్రియల్ ఫిబ్రిల్లేషన్ గురించి సులువుగా తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ ఇంకా దీనిపై పరిశోధనలు మెరుగుపరచాలని వారు అనుకుంటున్నారు. సూపర్‌మార్కెట్ ఈసీజీ ట్రాలీల పరిశోధనలు పూర్తయితే ఎంతోమందిని హార్ట్ ఎటాక్ నుండి కాపాడవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×