BigTV English

Synthetic Embryo : సింథటిక్ ఎంబ్రియో ప్రయోగాలు సక్సెస్.. కానీ..

Synthetic Embryo : సింథటిక్ ఎంబ్రియో ప్రయోగాలు సక్సెస్.. కానీ..

Synthetic Embryo : ఈరోజుల్లో ఏదైనా కృత్రిమంగా తయారు చేయడానికి పెద్ద సమయం ఏమీ పట్టడం లేదు. చాలా వస్తువులు చూడడానికి నేచురల్‌గానే అనిపించినా.. ఆర్టిఫిషియల్‌గా తయారు చేసినవి అయ్యింటాయి. ఈ కృత్రిమంగా తయారు చేయడం అనేది మనిషి శరీరం వరకు వచ్చేసింది. పిల్లలని కనే విషయంలో ఇబ్బందులు ఉన్నవాళ్ల కోసం కూడా ఇప్పుడు ఇలాంటి ఒక టెక్నాలజీ ఉపయోగపడడానికి సిద్ధపడుతోంది. అదే సింథటిక్ ఎంబ్రియో.


పిల్లలని కనే విషయంలో కూడా టెక్నాలజీలో ఎన్నో మార్పులు వచ్చాయి. అసలు ఇలా చేయవచ్చా అని మానవాళికి అవగాహన లేక ఆశ్చర్యపోయే విషయాలు ఎన్నో జరుగుతున్నాయి. ఎగ్స్‌ను ఫ్రీజ్ చేయడం, స్పెర్మ్‌ను స్టోర్ చేయడం.. ఇలాంటివి ఎన్నో మెడికల్ ఫీల్డ్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇక సింథటిక్ పద్ధతిలో ఎంబ్రియోలను డెవలప్ చేయాలని కూడా శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూ ఉండగా.. ఆ ప్రయోగాలు కూడా సక్సెస్ అయ్యాయి.

సింథటిక్ ఎంబ్రియోలు అనేవి ముందుగా ల్యాబ్స్‌లో తయారవుతాయి. అందుకే వీటి ద్వారా పలు జెనటిక్ సమస్యల గురించి తెలుసుకోవడం, వాటిని పరిష్కారాన్ని కనుక్కోవడం సులభమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతే కాకుండా మిస్ క్యారేజ్ లాంటి ప్రమాదాన్ని కూడా ముందే కనిపెట్టవచ్చని అన్నారు. కానీ సింథటిక్ ఎంబ్రియోల తయారీ అనేది నైతికంగా విలువలను మీరి ఉంటుందని చాలావరకు ప్రపంచ దేశాలు ఈ పద్ధతిని ఒప్పుకోవు. అంతే కాకుండా ఖండిస్తాయి కూడా. ఈ లిస్ట్‌లో యూకేతో పాటు మరెన్నో ఇతర దేశాలు కూడా ఉన్నాయి.


మెడికల్ రంగంలో సింథటిక్ ఎంబ్రియోల వినియోగం ఊపందుకుంటుంది అనే విషయాన్ని ఎవరూ చెప్పలేరు అని శాస్త్రవేత్తలు క్లారిటీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ఎంబ్రియోలను పేషెంట్ల గర్భంలోకి పంపించడం చట్టరీత్యా నేరం. ముందు ముందు ఇది నేరం కాదని నిర్ధారిస్తారో కూడా తెలిసే అవకాశం లేదని వారు అంటున్నారు. ఈ సింథటిక్ ఎంబ్రియో ద్వారా పిండం తయారయ్యే మొదటి 14 రోజులు ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసుకోవడం కోసం చాలా ఉపయోగపడుతుందని అన్నారు. ప్రస్తుతం ఈ విషయాన్ని తెలుసుకోవడం కోసం కేవలం ప్రెగ్నెన్సీ స్కాన్స్‌పైనే ఆధారపడాల్సి ఉంటుందని బయటపెట్టారు. అందుకే ప్రస్తుతం ప్రెగ్నెన్సీలోని మొదటి దశను స్టడీ చేయడానికి మాత్రమే సింథటిక్ ఎంబ్రియోలను ఉపయోగిస్తామని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×