Big Stories

Summer : మండుతున్న సూర్యుడు.. తెలుగు రాష్ట్రాల్లో అల్లాడుతున్న జనం..

Summer : తెలుగురాష్ట్రాల్లో భానుడి భగభగలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పగటిపూట 40 నుంచి 44 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం అల్లాడిపోతున్నారు. మరో వారం రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ ప్రకటించింది. ఏప్రిల్‌లోనే ఇలా ఉంటే… మే నెలలో ఇంకా ఎండలు ఎంత పెరుగుతాయో అని జనం భయపడుతున్నారు.

- Advertisement -

తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపింది.

- Advertisement -

APలోని దక్షిణ కోస్తాలో ఎండలు ఎక్కువగా ఉంటాయని, చాలా ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కాకినాడ, కోనసీమ, గుంటూరు, పల్నాడు జిల్లాలకు హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. రాయలసీమ జిల్లాల్లో 42 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.

వడగాల్పులతోపాటు ఉక్కబోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ ప్రభావంతో మధ్యాహ్నం సమయంలో రోడ్లపై జనసంచారం బాగా తగ్గిపోయింది. అత్యవసర పని ఉంటే తప్ప ప్రజలు బయటకు రావడానికి ఇష్టపడటం లేదు. వడదెబ్బబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు వైద్యులు సూచిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News