BigTV English

Technology:పక్షవాతం వచ్చినవారికి సాయం చేసే టెక్నాలజీ..

Technology:పక్షవాతం వచ్చినవారికి సాయం చేసే టెక్నాలజీ..

Technology:వైద్యరంగంలో ఎన్నో అంతుచిక్కని వ్యాధులు.. మనుషులను ఇబ్బంది పెడుతున్నాయి. ఒకవైపు పరిశోధకులు ఇలాంటి అంతుచిక్కని వ్యాధులకు కారణాలు ఏంటో కనుక్కునే పనిలో ఉంటే.. మరోవైపు కొందరు పరిశోధకులు.. ప్రస్తుతం మనుషులను ఇబ్బంది పెడుతున్న వ్యాధులపై పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా పక్షవాతంతో బాధపడుతున్నవారికి ఉపయోగపడే కొత్త టెక్నాలజీని మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు శాస్త్రవేత్తలు.


పక్షవాతంతో బాధపడుతున్న వారు తమ పనులు తాము చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. ఈ వ్యాధి వల్ల కొందరు తమ చేతులను కూడా కదిలించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి వారికోసమే సింక్రోన్ అనే కంపెనీ.. సింక్రోన్ స్విచ్ అనే టెక్నాలజీని తయారు చేసింది. ఇది ఏకంగా పక్షవాతం వచ్చిన వారి రక్త కణాల్లో అమర్చబడుతుంది. దీని సాయంతో వారు ఇంట్లోని స్మార్ట్ డివైజ్‌లను కేవలం మెదడు సాయంతోనే ఆపరేట్ చేసే అవకాశం లభిస్తుంది. ఇది వైద్యరంగంలో జరిగిన పరిశోధనల్లోనే ఒక అద్భుతం అని శాస్త్రవేత్తలు సంతోషిస్తున్నారు.

ఇప్పటివరకు ఈ సింక్రోన్ స్విచ్ టెక్నాలజీ అమెరికాలోని ముగ్గురు పేషెంట్లపై, ఆస్ట్రేలియాలోని నలుగురు పేషెంట్లపై ప్రయోగించి చూశారు. ఇది పక్షవాతం వచ్చిన వారు వేరేవారిపై పూర్తిగా ఆధారపడకుండా ఉండేలా చేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది సంతోషకరమైన విషయమని వారు అన్నారు. ఈ విషయంపై పేషెంట్ల కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషించారని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది సింక్రోన్ కంపెనీకి మరెన్నో పరిశోధనలు చేయడానికి ఊపునిచ్చిందని యాజమాన్యం తెలియజేసింది.


2012లో సింక్రోన్ ప్రారంభమయ్యింది. బ్రెయిన్, కంప్యూటర్ ఇంటర్ఫేస్‌ (బీసీఐ)పై మొదటినుండి సింక్రోన్ పరిశోధనలు చేస్తోంది. ఎలన్ మస్క్, బిల్ గేట్స్, జెఫ్ బిజోస్ లాంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా సింక్రోన్‌లో పెట్టుబడులు పెట్టారు. అప్పటినుండి ఈ కంపెనీ మెల్లగా పరిశోధనల్లో క్వాలిటీని పెంచుతూ ముందుకెళ్లింది. అమెరికాతో పాటు పలు ఫారిన్ దేశాల్లో ఫేమస్ అవ్వడం వల్ల ఇప్పుడు ఎంతోమంది ప్రముఖ వ్యాపారవేత్తలు సింక్రోన్ పరిశోధనలపై ఆసక్తి చూపిస్తున్నారు.

Changes in Space : నక్షత్రాల ఏర్పాటుతో అంతరిక్షంలో మార్పులు..

IT Sector:నష్టాల్లో ఐటీ రంగం..? నిజమేనా..?

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×