E-Paper
Advertisement

KL Rahul : గిల్ కొంపముంచిన మెడనొప్పి.. వన్డేల్లో పర్మనెంట్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ?

KL Rahul : గిల్ కొంపముంచిన మెడనొప్పి.. వన్డేల్లో పర్మనెంట్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ?
Advertisement

KL Rahul : భార‌త టీ-20 జ‌ట్టు వైస్ కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ తిరిగి టీమిండియా లోకి వ‌చ్చేశాడు. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మైన విష‌యం తెలిసిందే. అయితే డిసెంబ‌ర్ 09న క‌ట‌క్ లో జ‌రిగే తొలి 20 మ్యాచ్ కి ముందు జ‌ట్టులో చేరాడు. గిల్ ఆదివారం రాత్రి 9 గంట‌ల‌కు భువ‌నేశ్వ‌ర్ చేరుకోవ‌డంతో తొలి టీ-20 మ్యాచ్ ఆడే అవ‌కాశం ఉంద‌ని స్ప‌ష్ట‌మైంది. కానీ సౌతాఫ్రికా తో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్ ల్లో మెడ ప‌ట్టేసిన స‌మ‌స్య కార‌ణంగా కెప్టెన్సీ దూరం అయిన‌ట్టు వ‌న్డేల‌కు కెప్టెన్ గా కే.ఎల్. రాహుల్ కొన‌సాగ‌నున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. ముఖ్యంగా రాహుల్ కెప్టెన్సీలో టీమిండియా సౌతాఫ్రికాతో జ‌రిగిన వ‌న్డే సిరీస్ లో విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే.

Also Read : T20 World Cup 2026 : జియో హాట్ స్టార్ తప్పుకోవడంతో నష్టపోయేది వీళ్లే.. పోటీ పడుతున్న ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్?

రాహుల్ కెప్టెన్సీలో టీమిండియా సిరీస్ కైవ‌సం

Advertisement

సౌతాఫ్రికా వ‌ర్సెస్ టీమిండియా మ‌ధ్య జ‌రిగిన వ‌న్డే సిరీస్ 2-1 తేడాతో టీమిండియా కైవ‌సం చేసుకుంది. దీంతో సోష‌ల్ మీడియాలో రాహుల్ కెప్టెన్ గా కొన‌సాగ‌నున్న‌ట్టు వార్త‌లు వినిపించ‌డం విశేషం. కేఎల్ రాహుల్ ను కెప్టెన్ చేసేందుకు బీసీసీఐ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. మొన్న మెడనొప్పి కారణంగా దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ కు దూరం కావడంతో ఈ పరిస్థితి ఎదురైంది. శుబ్ మ‌న్ గిల్ ఆదివారం రాత్రి భువ‌నేశ్వ‌ర్ కి చేరుకున్నాడు. సౌతాఫ్రికా సిరీస్ కోసం టీమిండియా సిద్ధమ‌వుతున్న త‌రుణంలో ఈ వార్త జ‌ట్టుకు పెద్ద బ‌లాన్ని ఇవ్వ‌నుంఇ. కోల్ క‌తాలో జ‌రిగిన తొలి టెస్ట్ మ్యాచ్ సంద‌ర్భంగా గిల్ కు మెడ పెట్టేసిన స‌మ‌స్య త‌లెత్తింది. ఈ గాయం కార‌ణంగా గిల్ టెస్ట్, వ‌న్డే సిరీస్ ల‌కు పూర్తిగా దూర‌మ‌య్యాడు. టీ-20 సిరీస్ కి ఎంపికైన‌ప్ప‌టికీ ఫిట్ గా ఉంటేనే ఆడ‌టానికి అందుబాటులో ఉంటాడ‌ని బీసీసీఐ వెల్ల‌డించింది.

ఫిట్ నెస్ సాధించిన శుబ్ మ‌న్ గిల్

శుబ్ మ‌న్ గిల్ బెంగ‌ళూరులోని బీసీసీఐ సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ లో త‌న ఫిట్ నెస్ టెస్ట్ ను విజ‌య‌వంతంగా పూర్తి చేశాడు. ఫిట్ నెస్ ప్ర‌మాణాల‌ను గిల్ దాట‌గ‌లిగాడు. వైజాగ్ లో జ‌రిగిన చివ‌రి వ‌న్డే త‌రువాత టీమిండియా ప్ర‌ధాన కోచ్ గంభీర్ కూడా గిల్ ఫిట్ నెస్ ను ధృవీక‌రించాడు. మ‌రోవైపు గిల్ ప‌రుగులు చేయ‌డానికి కూడా చాలా ఆక‌లితో ఉన్నాడ‌ని ఓ సంద‌ర్భంలో చెప్పుకొచ్చాడు గంభీర్. కే.ఎల్. రాహుల్ ప్ర‌స్తుతం టెస్ట్ ల్లో, వ‌న్డేల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. టెస్ట్ ల‌కి, వ‌న్డేల‌కు కే.ఎల్. రాహుల్ ని కెప్టెన్ గా కొన‌సాగిస్తే.. బాగుంటుంద‌ని, సీనియ‌ర్ ఆట‌గాడు కాబ‌ట్టి అత‌ను టీమిండియాకి మంచి కెప్టెన్ అని కొంద‌రూ పేర్కొంటున్నారు. అత‌ని కెప్టెన్సీలో సీనియ‌ర్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ కూడా వ‌న్డేల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ లేకుంటే టీమిండియా క‌ప్ సాధించ‌డం క‌ష్టం అని ప‌లువురు భార‌తీయ‌ సీనియ‌ర్ ఆట‌గాళ్లు పేర్కొన్నారు. ప్ర‌స్తుతం కే.ఎల్. రాహుల్ టీమిండియా వ‌న్డే కెప్టెన్ గా ప‌ర్మినెంట్ ఉంటాడ‌నే వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

Advertisement

Also Read : Team India: దొంగోడిలా మారిన ఈ టీమిండియా ప్లేయ‌ర్ ఎవ‌రో తెలుసా ?

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×