BigTV English

Black Cat : ఇంటికి నల్లపిల్లి అందు కోసమే వస్తుంది!…

Black Cat : ఇంటికి నల్లపిల్లి అందు కోసమే వస్తుంది!…


Black Cat : కొంతమంది పిల్లి సెంటిమెంటును బాగా నమ్ముతుంటారు. పిల్లి ఎదురొచ్చింది అనగానే చాలా భయపడిపోతుంటారు.. ముఖ్యంగా పిల్లి శకునం మంచిది కాదు చాలామంది నమ్ముతుంటారు. ఏ శుభకార్యానికైనా బయలుదేరుతుంటే చాలు… పిల్లి కనిపిచిందంటే అన్నీ వదిలేసి ఇంట్లోనే పరిమితమవుతారు. ప్రయాణాలు కూడా వాయిదా వేసుకుంటారు. పిల్లి శకునం అంత భయంకరంగా నమ్ముతుంటారు.

చాలామంది కలలో పిల్లి కనిపిస్తే దురదృష్టమని అని అనుకుంటారు. కానీ మరి అదే పిల్లిని ఇంట్లో పెంచుకునే వాళ్ల పరిస్థితి ఏంటి.. ఇంట్లో నిత్యం పిల్లి తిరుగుతూ కనిపిస్తుంటే ఏ నష్టం జరగదా అని ప్రశ్నించే వారికి లెక్కే లేదు. పిల్లిని పెంచుకునేవారు మాత్రం తమ శక్తికి అది చిహ్నం అని చెప్పుకుంటారు.


తెల్లపిల్లి కనబడితే కష్టాలు రాబోతున్నాయని, అదే కలలో కాని నల్లపిల్లి కనిపిస్తే ఇంట్లో ప్రేతాత్మలు తిరుగుతున్నాయని ..ఇంటో దుష్టశక్తులు ఉన్నాయని భావించాలని కొంతమంది జ్యోతిష్కులు చెబుతుంటారు. ఇల్లు వికారంగా ఉండి…తరచూ ఇంట్లో గొడవలు పడటం, ఇతరులు ఎవర్నిపలకరించినా వారితో ఛీ కొట్టించుకోవడం లాంటి పరిస్థితులు ఎదుర్కొన్న వారికి మాత్రమే ఇలాంటి ఘటనలు ఎదురవుతాయట. ఆ ఇంట్లో వాళ్ల మనుషులకు ప్రశాంతత కరువై, తీవ్ర చికాకులు ఎదుర్కొంటూ ఉంటారు.

నిత్యం దీపారాధన చేసే ఇళ్లల్లో నల్లపిల్లి లాంటివి రావని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం, సాయంత్రం పూజలు చేసి దీపాలు పెట్టుకోవాలి. తరచూ జుట్టు విరబోసుకుని ఇంట్లో తిరగడం వల్ల కూడా దుష్టశక్తులు ఆకర్షితమై ఆవహించి కష్టాలు ఎదుర్కొంటారట.ఆ దుష్ట శక్తుల్ని చూసేందుకు ఇంటికి నల్ల పిల్లులు వస్తాయి. ఇంట్లో ప్రేతాత్మలు ఉన్నాయని చెప్పకనే చెప్పేందుకే నల్లపిల్లలు సంచరిస్తుంటాయి

Tags

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×