Samyuktha Menon : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్ వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈమె ఇప్పటివరకు స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. కెరీర్ పరంగా దూసుకుపోతున్న కుర్ర బ్యూటి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసేలా ఫోటోల ను షేర్ చేస్తుంది. ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. ఈ మధ్య పలు ఇంటర్వ్యూ ల్లో పాల్గొంటున్న ఈ అమ్మడు ఆమె గురించి పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటుంది. తాజాగా మాత్రం సంయుక్తా మీనన్ ఇచ్చిన ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ గా మారింది. తన లైఫ్ స్టైల్ ను వివరించే క్రమంలో తాను అల్కహాల్ కూడా తీసుకుంటానని చెప్పడం ఆసక్తికరంగా మారింది.. ప్రస్తుతం ఆమె ఇంటర్వ్యూ వీడియోను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు నెటీజన్స్.. ఆ వీడియో నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
Also Read : ‘లైలా’ ట్విట్టర్ రివ్యూ..విశ్వక్ హిట్ కొట్టాడా..?
ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నాకు ఆల్కహాల్ సేవించే అలవాటు ఉంది. కానీ ఎప్పుడు తాగను.. ఎప్పుడైన స్ట్రెస్ ఎక్కువైనప్పుడు మాత్రమే కాస్త తీసుకుంటాను అని సంకొచం లేకుండా చెప్పేసింది. సంయుక్తా మీనన్ ముక్కు సూటిగా చెప్పడం విశేషం. ఉన్నది ఉన్నట్టుగా చెప్పి తన ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం సంయుక్తా మీనన్ కామెంట్స్ మాత్రం వైరల్ గా మారాయి. ఏంటి సంయుక్త మీనన్ కు ఇలాంటి అలవాట్లు ఉన్నాయా అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
సంయుక్త మీనన్ సినిమాల విషయానికొస్తే.. పవర్ కళ్యాణ్ ‘బీమ్లా నాయక్’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. డేనియల్ శంకర్ రానా దగ్గుబాటి వైఫ్ పాత్రలో చక్కగా నటించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ‘బింబిసార’తో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే. ఆ వెంటనే తమిళంలో ‘సార్’ చిత్రం కూడా మంచి సక్సెస్ ను అందించింది.. సాయి ధరమ్ తేజ్ సరసన విరూపాక్ష మూవీలో నటించింది. ఆ మూవీ తో మరో బ్లాక్ బాస్టర్ ను తన ఖాతా లో వేసుకుంది. ఆ తర్వాత ఆమె ఏ మూవీ చేసిన హిట్ టాక్ ను అందుకోవడంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది. ఇకపోతే తెలుగు, మలయాళం లో వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ అయ్యింది. రోటీన్ కు భిన్నంగా ఉండే కథలను ఎంచుకుంటూ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుంది. ప్రస్తుతం ఈమె సినిమాల విషయానికొస్తే.. క్రేజీ ప్రాజెక్ట్ ‘బింబిసార 2’, నిఖిల్ ‘స్వయంభు’, నందమూరి బాలక్రిష్ణ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ సీక్వెల్ ‘అఖండ2’లో కూడా సంయుక్తా మీనన్ అవకాశం దక్కించుకుంది.. మొత్తానికి ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తుంది. ఆ మూవీలు ఎలాంటి హిట్ టాక్ ను సొంతం చేసుకుంటాయో చూడాలి.. తెలుగుతో పాటుగా మలయాళం లో కూడా సినిమాలు చేస్తుంది. త్వరలోనే కొన్ని సినిమాలు విడుదల కాబోతున్నట్లు సమాచారం.