EPAPER

Nasa : విశ్వం ఆవిర్భావానికి కారణ ‘భూతం’… ఈ అద్భుత చిత్రం

Nasa : విశ్వం ఆవిర్భావానికి కారణ ‘భూతం’… ఈ అద్భుత చిత్రం

Nasa : విశ్వంలో అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. వాటి అంతు చూడాలని సైంటిస్టులు రాత్రింబవళ్లు శ్రమిస్తూనే ఉన్నారు. అయినాసరే ఇప్పటిదాకా తెలిసినవి కొన్నే. విశ్వానికి సంబంధించిన రహస్యాల గుట్టువిప్పాలని నాసా అత్యాధునిక టెక్నాలజీ ప్రయోగిస్తోంది. ఉపగ్రహాలు ఛాయా చిత్రాలు తీస్తున్నాయి. తాజాగా నాసాకు చెందిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఓ అద్భుతమైన చిత్రాన్ని క్లిక్ మనిపించింది. అదే పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్. ఈ ఫొటో చూస్తే అందులో ఓ రాకాసి తల, కాళ్లలాంటివి కనిపిస్తాయి. నిజానికి ఇవి విశ్వం ఆవిర్భావానికి కారణభూతమైన పిల్లర్లుగా భావిస్తారు. మిడ్ ఇన్ఫ్రారెడ్ ఇన్ స్ట్రుమెంట్ – ఎంఐఆర్ఐలో దీన్ని చిత్రీకరించింది జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. ఈ చిత్రాలను, అందుకు సంబంధించిన సమాచారాన్ని నాసా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
ఇక్కడ చెప్పుకోదగ్గ విషయమేమిటంటే… ఈ టెలిస్కోప్… కాలంలో వెనక్కి వెళ్లి భూమికి 6,500 కాంతి సంవత్సరాల దూరంలోని పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్స్ ని ఇలా చిత్రీకరించింది. దీన్ని ఇంత స్పష్టంగా మనం చూడగలగడం ఇదే మొదటిసారి. నిజానికి భూతంలాగానో… రాకాసిలాగానో కనిపించే దీన్ని ధూళి మేఘంగా భావిస్తున్నారు శాస్త్రవేత్తలు.
టెలిస్కోప్ లోని అత్యంత బలమైన లెన్స్ వల్లనే విశ్వంలోని ఇంత స్పష్టమైన చిత్రాలను తీయడం సాధ్యమవుతోందంటారు శాస్త్రవేత్తలు. ఇక ప్రస్తుతం చిత్రించిన పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్స్ ప్రాంతంలో గ్యాస్, ధూళి పొరలు ఎక్కువగా ఉన్నాయంటోంది నాసా. అంతేకాదు ఇక్కడ వేలాది నక్షత్రాలు ఉన్నట్లు గుర్తించింది. నక్షత్రాలు ఏర్పడడంలో కీలకమైంది ధూళియే.
వాస్తవానికి పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్స్ ని టెలిస్కోప్ తో రికార్డు చేయడం ఇదేమీ కొత్తకాదు. 1995లోనే హబుల్ స్పేస్ టెలిస్కోప్ తో నాసా ఈ ప్రయోగం చేసింది. ఆ తర్వాత 2014లో మరోసారి హబుల్ స్పేస్ టెలిస్కోప్ తోనే ప్రయత్నం చేసింది. ఇక ఇతర అబ్జర్వేటరీలతోనూ పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ ను చిత్రీకరించే ప్రయత్నం చేసినా… అంతగా ఫలితం ఇవ్వలేదు. చివరికి నాసాకే చెందిన స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్ తోనూ స్పష్టంగా కనిపించేలా రికార్డు చేయడానికి ట్రై చేసినా కుదరలేదు. కానీ ఇప్పుడది జేమ్స్ వెల్ టెలిస్కోప్ తో సాధ్యమైనందుకు నాసా శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Tags

Related News

Supreme Court: సుప్రీంకోర్టు కీలక తీర్పు.. వయసు నిర్ధారణకు ఆధార్ ప్రామాణికం కాదు

Cyclone Dana: ‘దానా’ తుపాను ఎఫెక్ట్‌.. పలు రైళ్లతో పాటు ఆ ఎగ్జామ్స్ కూడా రద్దు!

AP Cabinet Meeting: సిలిండర్లపై మూడు గ్యాస్‌ కంపెనీలతో ఒప్పందం.. మంత్రి నాదెండ్ల మనోహర్‌

Kaleshwaram Investigation: మరోసారి కాళేశ్వరం బహిరంగ విచారణ.. కాళేశ్వరం ఓపెన్ కోర్టు

IAS Officer Amoy Kumar: ఐఏఎస్ అమోయ్ కుమార్ అక్రమాల పుట్ట పగలనుందా? అమోయ్ సొమ్మంతా ఎక్కడ?

Bengaluru: బెంగళూరులో భారీ వర్షం.. కుప్పకూలిన భారీ భవనం.. ఒకరు మృతి

Jagga Reddy: కేటీఆర్‌కు ప్రాక్టికల్ నాలెడ్జి లేదు.. అంతా బుక్ నాలెడ్జ్.. జగ్గారెడ్డి ఫైర్

Big Stories

×