BigTV English

SSMB29: మహేష్ బాబు – రాజమౌళి మూవీ షూటింగ్ షురూ..!

SSMB29: మహేష్ బాబు – రాజమౌళి మూవీ షూటింగ్ షురూ..!

SSMB29: టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం మూవీ తర్వాత రాజమౌళి తో సినిమా చేస్తున్నాడు. ఆ మూవీ అనౌన్స్ చేసి కూడా రెండేళ్లు పూర్తి అయ్యింది. కానీ అదిగో, ఇదిగో అంటూ ఫ్యాన్స్ ను ఊరిస్తూ వచ్చాడు రాజమౌళి. ఇప్పుడు మొత్తానికి షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్ చేశాడు. ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమాలు షూటింగ్ అప్డేట్ వచ్చేసింది. జనవరి 2వ తేదీ, గురువారం నాడు పూజా కార్యక్రమాలతో మహేష్‌ బాబు, ఎస్‌ఎస్‌ రాజమౌళి సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉదయం పది గంటలకు ఓపెనింగ్‌ జరుగుతుంది. మామూలుగా తన సినిమా ప్రారంభోత్సవానికి మహేష్‌ బాబు హాజరు కారు. మరి ఈ సినిమాకు వస్తాడా లేదా అన్నది చూడాలి.. వస్తే మాత్రం ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..


ఈ మూవీ లాంచింగ్ కార్యక్రమానికి సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు హాజరు కానున్నారు. దాదాపు అందరు కలుపు వంద మందికి పైగా హాజరుకానున్నారని సమాచారం. అల్యూమినియం ఫ్యాక్టరీలో మహేష్ బాబు సినిమా షూటింగ్ కొంత చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకని ఆఫీస్ అక్కడ ఏర్పాటు చేశారు. సుమారు ఏడాదిగా అక్కడ ఈ సినిమా పనులు చేస్తున్నారు.. మామూలుగా న్యూయర్ కోసం సెలెబ్రేటిలు న్యూయర్ వేడుకల కోసం విదేశాలకు వెళ్తారు. మహేష్ బాబు కూడా ప్రతి ఏడాది ఏదొక దేశానికి వెళ్ళేవాడు. ఇప్పుడు ఈ సినిమా కోసం అని ఎక్కడికి వెళ్లకుండా ఉన్నారని తెలుస్తుంది. డిసెంబర్ 31కి మూడు నాలుగు రోజుల ముందు విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చారు. సినిమా ఓపెనింగ్ ఉండడం వల్ల ఆయన వచ్చినట్లు సమాచారం అందుతోంది. పూజా కార్యక్రమాలు పూర్తి అయ్యాక మరొకసారి మహేష్ బాబు విదేశాలు వెళతారు. అయితే ఈసారి వెళ్లేది వెకేషన్ కోసం కాదు షూటింగ్ కోసమే అట..

ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్రికాలో జరగనుంది.. కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్ వెళ్లిన రాజమౌళి, లొకేషన్స్ చెక్ చేసి వచ్చారు. అప్పుడు ఆయనతో పాటు ఎస్ఎస్ కార్తికేయ కూడా ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఆఫ్రికాలో ప్లాన్ చేస్తున్నారు. కెన్యా తో పాటు సౌత్ ఆఫ్రికాలోని కొన్ని లొకేషన్లలో కూడా షూటింగ్ చేసే అవకాశం ఉందని రాజమౌళి సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం.. మహేష్ బాబు గుంటూరు కారం తర్వాత మరో సినిమాను ఇప్పటివరకు అనౌన్స్ చెయ్యలేదు. అలాగే రాజమౌళి కూడా ట్రిపుల్ ఆర్ తర్వాత మూవీని చెయ్యలేదు. ఈ మూవీ పై ఈ ఇద్దరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి రేపు మూవీ లాంచింగ్ కార్యక్రమానికి ఎవరెవ్వరు హాజరావుతారో చూడాలి.. ఈ మూవీలో మహేష్ బాబు ఎలా కనిపిస్తారో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. హీరోయిన్ గా ఇంటర్నెషనల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ను సెలెక్ట్ చేసినట్లు టాక్..


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×