Wife Parda Divorce High court| భార్య బుర్కా ధరించపోయినంత మాత్రాన విడాకులు ఇవ్వడానికి కుదరదని అలహాబాద్ హై కోర్టు చెప్పింది. బహిరంగ ప్రదేశాల్లో భార్య ముఖం చూపిస్తూ తిరగడాన్ని ఓ భర్త మానసిక వేధింపులు గా పేర్కొంటూ తనకు విడాకులు మంజూరు చేయాలని హై కోర్టును ఆశ్రయించాడు. కానీ బుర్కా ధరించకపోవడం మానసిక వేధింపులకు సమానం కాదని హై కోర్టు అభిప్రాయపడింది. కానీ ఇతర కారణాలతో ఈ కేసులో విడాకులు మంజూరు చేసే అవకాశాలున్నాయని సూచనలు చేసింది.
అలహాబాద్ హై కోర్టుకు చెందిన జస్టిస్ సౌమిత్ర దయాల్ సింగ్, జస్టిస్ డొనాది రమేష్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు ఒక భర్త తన భార్య నుంచి విడాకులుతో దాఖలు చేసిన పిటీషన్‌ను విచారణ చేసింది. తన భార్య తనను చాలా కాలం క్రితమే వెళ్లిపోయిందని.. మానసికంగా వేధించిందని సదరు భర్త పిటీషన్ లో పేర్కొన్నాడు.
ఈ కేసుల భర్త తరపున లాయర్ వాదిస్తూ.. సదరు భార్య బుర్కొ ధరించకుండా మార్కెట్ వెళుతుందని, ఇతర బహిరంగ ప్రదేశాల్లో పరపురుషులతో తిరుగుతుందని.. ఇదంతా తన భర్తను మానసికంగా వేధించడానికే చేసిందని ఆరోపించారు. దీనిపై హై కోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పందిస్తూ.. “భార్యకు కూడా సొంత నిర్ణయాలు తీసుకునే అధికారులు ఉన్నాయి. ఆమె సమంజంలో బుర్కా ధరించకుండా తిరిగేందుకు ఆమెకు అన్ని హక్కులున్నాయి. అయితే ఆమె వివాహేతర సంబంధం, లేదా చట్టాలను, నైతిక విలువలను ఉల్లంఘించడం చేస్తేనే మానసికంగా వేధించినట్లు అవుతుంది. భార్యభర్తలిద్దరికీ సొంత అభిప్రాయాలుంటాయి. కానీ వాటిని ఎదుటి వ్యక్తిపై బలవంతంగా రుద్దితే అది మానసిక కృూరత్వాన్ని చూపుతుంది. ఇవన్నీ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాల వల్ల ప్రారంభమవుతాయి. వీటని మానసక వేధింపులుగా గుర్తించడం కష్టం ” అని తెలిపింది.
Also Read: దేవాలయాలను ధ్వంసం చేసేందుకు గవర్నర్ ఆదేశాలిచ్చారు.. ఢిల్లీ సిఎం సంచలన వ్యాఖ్యలు
అయితే ఈ కేసులో ఇంతకుముందు విచారణ చేపట్టిన ఫ్యామిలీ కోర్టు తీర్పును అలహాబాద్ హై కోర్టు సమర్థించింది. భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు భర్త ఆరోపణలు చేశారే తప్ప నిరూపించేలేదని చెప్పింది. ముస్లిం మతానికి చెందిన ఈ దంపతుల విడాకులు కేసులో భార్య ఒక పంజాబీ బాబాతో వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త ఆరోపణలు చేశాడు. కానీ వాటిని నిరూపిస్తూ సరైన ఆధారాలు కోర్టు ముందు ప్రవేశ పెట్టలేదు.
అయితే హై కోర్టు సదరు భర్తకు కొన్ని సూచనలు చేసింది. ఈ కేసులో భార్య చాలా కాలంగా భర్త నుంచి విడిపోయి వేరుగా జీవిస్తోంది. ఆమెను భర్త కాపురం కోసం పిలిచినా రాలేదు కనుక ఈ కారణాల చేత విడాకులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పైగా భార్య ఒక ప్రభుత్వ టీచర్ ఉద్యోగం చేస్తోంది. భర్త ఒక ఇంజినీర్. దీంతో ఈ కేసులో భరణం లాంటి కోణం కూడా లేదని.. ఇద్దరికీ పుట్టిన సంతానం.. ఒక కొడుకు ఇప్పుడు 29 ఏళ్ల యువకుడు కాబట్టి.. అతని కస్టడీ సమస్యలు కూడా లేవని అభిప్రాయపడింది.
Also Read: న్యూ ఇయర్ పార్టీ కోసం పబ్ వింత ఏర్పాట్లు.. కస్టమర్లకు కండోమ్, ఓఆర్ఎస్ ప్యాకెట్ల కానుకలు..