BigTV English

Paperless Budget:మూడోసారీ పేపర్‌లెస్‌ బడ్జెట్‌.. డౌన్‌లోడ్‌ ఎలాగంటే?

Paperless Budget:మూడోసారీ పేపర్‌లెస్‌ బడ్జెట్‌.. డౌన్‌లోడ్‌ ఎలాగంటే?

Paperless Budget:2023-24 వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతున్నారు… కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. వరుసగా మూడో ఏడాది కూడా ఆమె పేపర్‌లెస్‌ బడ్జెట్‌తో సభ ముందుకు రానున్నారు. అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా రికార్డు సృష్టించిన నిర్మల… మేడిన్ ఇండియా ట్యాబ్లెట్ ద్వారా బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు.


బడ్జెట్‌ సమాచారం సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా ఇంగ్లిష్, హిందీ భాషల్లో ప్రత్యేక యాప్ తీసుకొచ్చింది… కేంద్రం. ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టాక, ‘యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్’లో బడ్జెట్ కాపీలను పీడీఎఫ్‌ ఫార్మాట్లో విడుదల చేస్తారు. అప్లికేషన్ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రూపొందించిన ఈ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లు రెండింటిలోనూ డౌన్‌లోడ్ చేసుకుని… బడ్జెట్ పత్రాలను పూర్తిగా యాక్సెస్ చేసుకోవచ్చు. బడ్జెట్ ప్రసంగం, వార్షిక ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్, డిమాండ్ ఫర్ గ్రాంట్స్, ఫైనాన్స్ బిల్లులు సహా… మొత్తం బడ్జెట్ డాక్యుమెంట్లను యాప్‌లో చూడొచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యూనియన్ బడ్జెట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఐఓఎస్ ఫోన్ యూజర్లు యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అధికారిక యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్‌ ద్వారా కూడా బడ్జెట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్‌ యూజర్లు అయితే గూగుల్ ప్లే స్టోర్‌ యాప్‌లో యూనియన్ బడ్జెట్ అని సెర్చ్‌ చేయాలి. బ్లూ లోగోతో ఉండే అధికారిక యూనియన్ బడ్జెట్‌ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఐఓఎస్ యూజర్లు ముందుగా యాపిల్ యాప్‌ స్టోర్‌ను ఓపెన్ చేసి, యూనియన్ బడ్జెట్ పేరుతో సెర్చ్‌ చేయాలి. ఆ తర్వాత అధికారిక యాప్‌ డౌన్‌లోడ్‌పై క్లిక్ చేయాలి. ఈ యాప్ ద్వారా పూర్తిగా ఫోన్లోనే బడ్జెట్‌ వివరాలను పరిశీలించవచ్చు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×