Big Stories

Ultrasound Device : బీపీని కనిపెడుతూ ఉండే డివైజ్.. కేబుల్స్ లేకుండా డేటా ట్రాన్స్‌మిట్..

Ultrasound Device : ఇప్పటికే హార్ట్ రేట్, బీపీ లాంటివి ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండడం కోసం ఎన్నో స్మార్ట్ టెక్నాలజీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్ లాంటివి ఎన్నో పరికరాలు ఇప్పుడు మన రోజూవారి జీవితంలో జరిగే విషయాలను కనిపెడుతూ.. శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి అనే విషయాన్ని కనిపెట్టేస్తున్నాయి. తాజాగా అల్ట్రాసౌండ్ సిస్టమ్‌తో ఒక ధరించగలిగే పరికరాన్ని తయారు చేసి.. బీపీని కనిపెట్టడం కోసం ఉపయోగించనున్నారు శాస్త్రవేత్తలు.

- Advertisement -

అల్ట్రాసౌండ్ సిస్టమ్‌తో తయారు చేసిన ఈ డివైజ్.. ధరించడానికి సులువుగా ఉండి, గుండెను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటుంది. అంతే కాకుండా ఈ డివైజ్ నుండి డేటాను ట్రాన్స్‌మిట్ చేయడం కూడా సులభమని తెలుస్తోంది. గుండెను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ.. గుండె సంబంధిత వ్యాధుల నుండి మనుషులను కాపాడడానికి దీనిని ఉపయోగించవచ్చని ఈ డివైజ్‌ను తయారు చేసిన క్యాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పటివరకు అల్ట్రాసౌండ్‌తో ఉన్న సెన్సార్లు.. డేటాను ట్రాన్స్‌మిట్ చేయాలంటే కేబుల్స్ ఉపయోగించాల్సి ఉండేదని, ఈ డివైజ్‌కు అలాంటి అవసరం లేదని అన్నారు.

- Advertisement -

ఈ డివైజ్‌కు అల్ట్రాసౌండ్ సిస్టమ్ ఆన్ ప్యాచ్ (యూఎస్సోపీ) అని పేరు పెట్టారు శాస్త్రవేత్తలు. ఇది చిన్నగా ఉండి, అందులోనే కంట్రోల్ సర్క్యూట్ కూడా ఉంటుంది. వైర్‌లెస్ పద్ధతిలో డేటాను ట్రాన్స్‌మిట్ కూడా చేయవచ్చు. ఇది డేటాను ఎప్పటికప్పుడు కనిపెట్టడంతో పాటు మోషన్‌ను కూడా ట్రాక్ చేస్తుంది. ఇది శరీరంలోని 164 మిల్లీమీటర్ల లోతు వరకు ఉన్న టిష్యుల కదలికలను సిగ్నల్స్ రూపంలో డేటాను ట్రాన్స్‌మిట్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీంతో బీపీ, గుండె చప్పుడు లాంటి వాటిని 12 గంటల పాటు నిర్విరామంగా కనిపెడుతూ ఉండవచ్చు.

ఎలాంటి గుండె సంబంధిత వ్యాధి లేనివారికి ఇది వ్యాయమం సమయంలో వారి గుండె ఎలా కొట్టుకుంటుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. దాన్ని బట్టి వారి వర్క్‌వుట్ ప్లాన్స్‌ను మార్చుకునే సౌలభ్యాన్ని కల్పిస్తుంది. అలా కాకుండా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారికి ఈ డివైజ్.. గుండెపోటు లాంటి అవకాశాలను ముందే సూచించడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. లోపల ఉన్న టిష్యూల ఫంక్షన్‌ను కూడా తెలుసుకుంటుంది కాబట్టి ఇది ఇతర డివైజ్‌ల కంటే భిన్నమని వారు తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News