Big Stories

CAR-T Therapy: బ్లడ్ క్యాన్సర్ నుండి బయటపడేసే కార్-టీ థెరపీ..

CAR-T Therapy : క్యాన్సర్ లాంటి కఠినమైన వ్యాధికి కూడా ఇప్పట్లో చికిత్స అనేది ఉంది. టెక్నాలజీ వల్లే ఇది సాధ్యమయ్యింది. కానీ అందులోని ప్రతీ చికిత్సకు ఒకే విధంగా సక్సెస్ రేట్ అనేది లేదు. ముందుగానే క్యాన్సర్ గురించి గుర్తిస్తే చికిత్స ద్వారా పేషెంట్‌ను బ్రతికించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు కనిపెట్టిన కొత్త క్యాన్సర్ చికిత్సకు సక్సెస్ రేట్ దాదాపు 90 శాతం ఉందని, ఇది తీవ్రమైన బ్లడ్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్లను కూడా బ్రతికిస్తుందని తెలుస్తోంది.

- Advertisement -

మైలోమా క్యాన్సర్.. ఇది ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్. చెప్పాలంటే ఇది చాలామందిలో కామన్‌గా కనిపిస్తున్న బ్లడ్ క్యాన్సర్ రకం. బ్లడ్ క్యాన్సర్ వచ్చిన వారిలో దాదాపు 10 శాతం మంది ఈ మైలోమాతోనే బాధపడుతుంటారు. ఇక అందులో 1 శాతం మంది దీని వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. గత కొన్నేళ్లుగా మైలోమా క్యాన్సర్‌కు చికిత్సను అందించాలని శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్‌తో దీనికి చికిత్స సాధ్యమని అదే కోణంలో పరిశోధణలు చేస్తున్నారు.

- Advertisement -

బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్, ఇమ్యూన్ థెరపీ ద్వారా మైలోమా క్యాన్సర్‌కు చికిత్సను అందించవచ్చనే ఉద్దేశ్యంతో శాస్త్రవేత్తలు ఆ ప్రయత్నాలను వదిలిపెట్టలేదు. కానీ తాజాగా కార్ టీ ట్రీట్మెంట్స్‌తో ఈ క్యాన్సర్‌కు చికిత్సను అందించడం వల్ల రిజల్ట్స్ మెరుగ్గా వస్తాయని వారు తెలుసుకున్నారు. ఇలా చికిత్స తీసుకున్న చాలామంది పేషెంట్లు ఎక్కువకాలం జీవించడంతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ను కూడా పెంచుకునే అవకాశం ఉందని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

జెనటిక్ ఇంజనీరింగ్ ద్వారా మైలోమా క్యాన్సర్‌కు చికిత్సను కనిపెట్టారు. ఒకప్పుడు ఈ పద్ధతిలో చికిత్సను పొందినవారు కేవలం రెండేళ్లు మాత్రమే బతికే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు తమ జీవితకాలం పెంచుకునే విధంగా ఈ టెక్నాలజీ మారిందని శాస్త్రవేత్తలు తెలిపారు. దాని పేరు కార్ టీ. అంటే చిమరిక్ యాంటీజెన్ రిసెప్టర్ టీ సెల్ థెరపీ. ఇది పేషెంట్ల ఇమ్యూన్ సిస్టమ్‌ను పెంచి క్యాన్సర్‌ను ఫైట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటికే 74 పేషెంట్లపై ఈ థెరపీని ఉపయోగించారని, వారిలో జీవితకాలం 90 శాతం పెరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ థెరపీ కోసం మరో 200 మంది పేషెంట్లు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News