Big Stories

Tiktok: సీఈవో ఇంట్లో టిక్‌టాక్ వాడరట.. మరి మనకెందుకు అంత పిచ్చ!?

Tiktok: వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ అంటే తెలియని వారుండరు. ఒకప్పుడు ఈ యాప్‌లేని ఫోన్ అంటూ ఉండేది కాదు. సెలబ్రెటీల నుంచి మామూలు మనుషుల వరకు అందరూ ఈ యాప్‌లో వీడియోలు చేసే వారు. చెప్పాలంటే ఎంతో మందికి ఈ యాప్ గుర్తింపు తీసుకొచ్చి పెట్టింది. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉండే వారు ఈ యాప్‌తో ఓవర్‌నైట్‌లో ఫేమస్ అయిపోయారు.

- Advertisement -

అయితే ఈ యాప్‌లో కంటెంట్ సరిగా లేదని, ఫోర్నోగ్రఫీని ఎంకరేజ్ చేస్తుందని, చైల్డ్ యూజర్లకు సెక్సువల్ ప్రిడేటర్స్ టార్గెట్ చేసే ప్రమాదం ఉందని 2019లో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కేంద్ర ఈ యాప్‌ను భారత్‌లో బ్యాన్ చేసింది. భారత్‌తో పాటు చాలా దేశాలు ఈ యాప్‌పై నిషేధం విధించాయి.

- Advertisement -

ఇక తాజాగా టిక్ టాక్ సీఈఓ షో జి చ్యూ యూఎస్ కాంగ్రెస్ ముందు విచారణకు హాజరయ్యారు. మీ పిల్లలు టిక్ టాక్ వాడుతున్నారా? అని కాంగ్రెస్ సభ్యులు చ్యూను ప్రశ్నించారు. అయితే తమ పిల్లలు సింగపూర్‌లో ఉంటారని, అక్కడ చైల్డ్ టిక్‌టాక్ వెర్షన్ అందుబాటులో లేదని చెప్పారు. కేవలం అమెరికాలో మాత్రమే చైల్డ్ టిక్ టాక్ వెర్షన్ అందుబాటులో ఉందని.. ఒకవేళ తమ పిల్లలు అమెరికాలో ఉంటే కచ్చితంగా టిక్ టాక్ ఉపయోగించేందుకు అంగీకరించేవాడినని వెల్లడించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News