E-Paper
Advertisement

Tips to Prevent cracking skin in Winter : చలికాలంలో చర్మం పగలకుండా ఇలా చేయండి

Tips to Prevent cracking skin in Winter : చలికాలంలో చర్మం పగలకుండా ఇలా చేయండి
Advertisement

Tips to Prevent cracking skin in Winter : చ‌లికాలంలో మామూలుగానే చాలా మందికి చ‌ర్మం ప‌గులుతుంది. ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేందుకు రకర‌కాల చిట్కాల‌ను పాటిస్తుంటారు. కొంద‌రు క్రీములు రాస్తారు, మరికొందరు ఆయిల్స్‌ రాసుకుంటారు. వీటితో పాటు మరికొన్ని ఆహారాలను తీసుకుంటే చర్మం కాపాడుకోవచ్చు. అంతేకాకుండా మన చ‌ర్మం మృదువుగా, కాంతివంతంగా అవుతుంది. క్యారెట్ల‌లో చాలా విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. అంతేకాకుండా బీటా కెరోటీన్ సంవృద్ధిగా ఉంటుంది. వీటిని మ‌న శ‌రీరం విట‌మిన్ ఎ లాగా మార్చుకుంటుంది. విట‌మిన్ ఎ మన చ‌ర్మం రోగ నిరోధ‌క శ‌క్తిని కూడా పెంచుతుంది. ఏదైనా గాయాలు తగిలినా తొందరగా మానుతాయి. అంతేకాకుండా చ‌ర్మం ప‌గ‌ల‌కుండా ఉంటుంది. చ‌ర్మానికి స‌హ‌జసిద్ధంగా తేమ కూడా లభిస్తుంది. కాంతివంతంగా కనిపిస్తుంది. ప్రతిరోజు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగడంతో స్కిన్‌ ప్రకాశవంతంగా మారుతుంది. శరీరంలో ఉండే అనవసరమైన వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. దీంతో చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గిపోతాయి. ఈ బీట్‌రూట్‌లో ఉండే విట‌మిన్ సి ఫ్రీ ర్యాడిక‌ల్స్‌పై సమర్థవంతంగా పోరాడుతుంది. వయసు మీద పడటంతో వచ్చే వృద్ధ్యాప్య చాయలు కూడా తగ్గుతాయి. య‌వ్వ‌నంగా కనిపిస్తారు. బ్రొకొలిలో విట‌మిన్ సి, ఎలు పుష్కలంగా ఉంటాయి. ఇది మన చ‌ర్మ ఆరోగ్యాన్ని సంర‌క్షిస్తుంది. క‌ణ‌జాలంతో పాటు చ‌ర్మం, వెంట్రుక‌ల క‌ణాలు పెరిగేందుకు బ్రొకొలిలోని విట‌మిన్లు ఎంతగానో దోహదం చేస్తాయి. అంతేకాకుండా బ్రొకొలిలో ఉండే కొల్లాజెన్ అనే ప్రోటీన్ మన చ‌ర్మ క‌ణాల‌కు మ‌ర‌మ్మ‌త్తులు కూడా చేస్తుంది. దీంతో చ‌ర్మం కొత్త‌గా మారిపోతుంది. ఇందులోని బి విట‌మిన్లు చ‌ర్మ ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. ప‌గ‌ల‌కుండా చూస్తాయి. నారింజలో ఉండే సిట్రిక్ యాసిడ్ మన చ‌ర్మానికి ఎంతో మేలు చేస్తుంది. చ‌ర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఇందులో ఉండే విటమిన్‌ సి చర్మాన్ని కాపాడుతుంది. దానిమ్మలో నీరు అధికశాతం ఉంటుంది. వీటిని తీసుకుంటే మన చర్మం ఎప్పుడూ తేమగా, మృదువుగా మారుతుంది. మంచి స్కిన్‌టోన్‌ పొందవచ్చు. ఈ దానిమ్మపండ్లలో ఉండే విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను తరిమేస్తాయి. దాని వల్ల మన చర్మం పగలకుండా ఉంటుంది.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×