E-Paper
Advertisement

Urinary Infection : యూరిన్‌లో ఇన్‌ఫెక్షన్‌ తగ్గించే చిట్కాలు

Urinary Infection : యూరిన్‌లో ఇన్‌ఫెక్షన్‌ తగ్గించే చిట్కాలు
Advertisement

Urinary Infection : మన మూత్రనాళంలోకి ఏదైనా హానికర బ్యాక్టీరియా ప్రవేశిస్తే యూరినరీ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఎక్కువగా ఆడవాళ్లలో ఈ సమస్య సర్వసాధారణంగా కనిపిస్తుంది. ఈ సమస్య ఉన్నవారిలో పొత్తి కడుపులో మంట, మూత్రం రంగు మారిపోవడం, పదేపదే మూత్రానికి వెళ్లడంలాంటి లక్షణాలు కనిపిస్తాయి. వెన్నెముక, కడుపు కింది భాగంలో బాగా నొప్పిగా ఉంటుంది. పరిశుభ్రత లోపించడం వల్ల ప్రధానంగా ఈ సమస్య వచ్చినా యాంటీ బయోటిక్స్‌ అధికంగా వాడటం, మూత్రపిండంలో రాళ్లు ఉన్నా ఇలాంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. మన జీవన శైలిలో మార్పులు చేసుకోవడం వల్ల యూటీఐ సమస్యను తగ్గించుకోవచ్చని వైద్యులు అంటున్నారు. ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నవాళ్ల శరీరం డీహైడ్రేట్‌ అవుతుంది. అధిక మోతాదులో నీళ్లు తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవచ్చు. అంతేకాకుండా బ్యాక్టీరియా చేరే అవకాశాలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా ట్రాక్ట్‌లో బ్యాక్టీరియా ఉండకుండా మూత్రం ద్వారా బయటకు పంపుతుంది. అందుకే రోజుకు మూడు లీటర్లకు తక్కువ కాకుండా ద్రవ పదార్థాలు తీసుకోవాలి, కొబ్బరి నీళ్లు తీసుకుంటే చాలా మంచిది. బియ్యం నీరు ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించేందుకు ఎంతో సాయపడతాయి. యూటీఐ ఉన్నవారు ఎక్కువ ఫైబర్‌ ఉన్న ఆహారాలు తీసుకోవాలి. దీని వల్ల సహజంగా మూత్రాశయం, మూత్రనాళాలు శుభ్రం అవుతాయి. మలబద్దకం సమస్యను కూడా నివారించుకోవడంలో ఫైబర్‌ సహాయపడుతుంది. ప్రతిరోజు 25 గ్రాముల ఫైబర్‌ ఉన్న పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు తినడం అలవరుచుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల యూటీఐ సహా అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. సాధారణ వ్యాయామాల్ని చేయాలి. శరీర ఉష్ణోగ్రత పెరిగిన సందర్భాల్లో ఈ సమస్య కూడా పెరుగుతుంది. యూటీఐని ప్రేరేపించే ఆహారాలు, పానీయాలను దూరం పెట్టడం చాలా మంచిది. ముఖ్యంగా మసాలాలు, సిట్రస్‌ పండ్లు, కెఫిన్‌, బీర్‌, రెడ్ వైన్‌ దూరం పెట్టాలి. అలాగే యాసిడ్ కంటెంట్ ఉన్న టమాటలాంటి ఆహారాలు తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×