BigTV English

Music director Koti: సంగీత ద‌ర్శ‌కుడు కోటికి గౌర‌వ డాక్ట‌రేట్‌

Music director Koti: సంగీత ద‌ర్శ‌కుడు కోటికి గౌర‌వ డాక్ట‌రేట్‌

Music director Koti:ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కోటి గౌర‌వ డాక్ట‌రేట్ అందుకున్నారు. కే ఎల్ యూనివ‌ర్శిటీ ఆయ‌న్ని గౌర‌వ డాక్ట‌రేట్‌తో సత్కరించింది. ఇక‌పై ఆయ‌న డాక్ట‌ర్ సాలూరి కోటేశ్వ‌ర‌రావు అంటూ తెలుగు సంగీత ద‌ర్శ‌కుల సంఘం ఆయ‌న్ని స‌త్క‌రించుకుంది. ఇండియ‌న్ కంపోజ‌ర్‌గా, గాయ‌కుడిగా తెలుగు, హిందీ సినిమాల‌కు ప‌నిచేశారు కోటి. దాదాపు 475 సినిమాల‌కు ప‌నిచేసిన ఘ‌న‌త ఆయ‌న‌ది. సాలూరి రాజేశ్వ‌ర‌రావు కొడుకుగా సినిమా రంగ ప్ర‌వేశం చేశారు కోటి. టి.వి.రాజ్‌తో క‌లిసి చాలా సినిమాల‌కు ప‌నిచేశారు. రాజ్ – కోటి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సంగీతానికి ఇప్ప‌టికీ స్పెష‌ల్ అభిమానులున్నారు. వారిద్ద‌రూ క‌లిసి 180 సినిమాల‌కు సంగీతం అందించారు. 1983లో మొద‌లైన వారి ప్ర‌స్థానం 1994 వ‌ర‌కు కొన‌సాగింది. ఆ త‌ర్వాత కూడా కోటి చాలా సినిమాల‌కు ట్యూన్లిచ్చారు. 1994లో హ‌లో బ్ర‌ద‌ర్ సినిమాకు నంది అవార్డు అందుకున్నారు.


కె.చ‌క్ర‌వ‌ర్తి గారి ద‌గ్గ‌ర సంగీత శిష్య‌రికం చేసిన‌ప్ప‌టి నుంచీ నిత్య విద్యార్థిగానే ఉంటున్నాన‌ని అంటారు కోటి. ఎన్నో రియాలిటీ షోల‌కు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించారు. ఎ.ఆర్‌.రెహ‌మాన్‌, మ‌ణిశ‌ర్మ‌, హ్యారిస్ జైరాజ్‌, దేవిశ్రీ ప్ర‌సాద్‌, త‌మ‌న్ వంటివారంద‌రూ కోటి ద‌గ్గ‌ర మెళ‌కువ‌లు నేర్చుకున్న‌వారే. కోటి త‌న‌యుడు రోష‌న్ సాలూరి సంగీత ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్ చిత్రాల‌కు ప‌నిచేస్తున్నారు.
ఆయ‌న మ‌రో త‌న‌యుడు రాజీవ్ సాలూరి న‌టుడిగా సినిమాలు కొన‌సాగిస్తున్నారు. ఇన్నాళ్లూ సినిమా రంగంలో తాను చేసిన కృషిని గుర్తించిన కేఎల్‌యూనివ‌ర్శిటీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు సంగీత ద‌ర్శ‌కుడు కోటి. డాక్ట‌ర్ కోటి అనిపించుకోవ‌డంలో ఓ ఆనందం ఉంద‌ని, ప్రతిభకు ద‌క్కిన గౌర‌వంగా విన‌య‌పూర్వ‌కంగా స్వీక‌రిస్తున్నాన‌నీ అన్నారు కోటి.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×