BigTV English

Tirupati Shirdi: తిరుపతి తర్వాత షిర్డీనే

Tirupati Shirdi: తిరుపతి తర్వాత షిర్డీనే

Tirupati Shirdi: కరోనా తర్వాత భక్తులు పుణ్యక్షేత్రాలకు క్యూ కడుతున్నారు. అందుకే ఎప్పుడూ లేని విధంగా అన్ని చోట్ల భక్తుల క్యూలు కనిపిస్తున్నాయి. సందర్శనీయ ప్రాంతాలన్నీ పర్యాటకులతో నిండిపోతున్నాయి. దేశంలోనే అత్యధికంగా భక్తులు సందర్శించిన ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తిరుమల రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విలసిల్లుతున్న వారణాసి నిలిచింది. కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించేందుకు భక్తులు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చారు. కాశీ విశ్వేశ్వరుడ్ని భక్తులు సందర్శించి పూజలు చేశారు. ఓయో కల్చరల్ ట్రావెల్ రిపోర్టు
పుణ్యక్షేత్రాలపై సర్వే చేసింది. ఓయో కల్చరల్ ట్రావెల్ రిపోర్టు ప్రకారం దేశ వ్యాప్తంగా భక్తులు చూసిన దర్శనీయ, పర్యాటక ప్రాంతాల్లో మొదటి స్థానం వారణాసి తర్వాత తిరుమల నిలిచాయి.


వారణాసి హిందువులుతోపాటు బౌద్ధులు ఇద్దరికీ ప్రధాన తీర్థయాత్ర కేంద్రాలలో ఒకటి. మొత్తం భారతదేశంలోని మతపరమైన పర్యాటక ప్రదేశాల కంటే వారణాసికి ప్రజాదరణ ఎక్కువగా ఉంది.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కరోనా ఆంక్షలను ప్రభుత్వం సడలించడంతో తిరుమల భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పర్యాటకుల గదుల బుకింగ్ తిరుపతి నగరంలో గత ఏడాదితో పోలిస్తే ఈసారి 233 శాతం పెరిగింది. వారణాసి, షిర్డీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఆ తరువాత ఒడిశాలోని పూరీ, పంజాబ్ లోని అమృత్‌సర్‌, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లను కూడా అత్యధిక ప్రజలు తమకు ఇష్టమైన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఉత్తరాఖండ్ లోని రిషికేశ్, ఉత్తరప్రదేశ్‌లోని మధుర, మహాబలేశ్వర్ తో పాటు తమిళనాడులోని మధురై కూడా ఈ సర్వేలోని దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాలలో పేరు సంపాదించాయి. . గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఆధ్యాత్మి పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య చెప్పుకోదగ్గ రీతిలో పెరిగింది. మొత్తం భారతదేశంలోని మతపరమైన పర్యాటక ప్రదేశాల కంటే వారణాసికి ప్రజాదరణ ఎక్కువగా ఉంది.


Tags

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×