Big Stories

HarishRao: పోలవరంపై హరీశ్‌రావు హాట్ కామెంట్ ..అప్పటికీ పూర్తి కాదని స్టేట్ మెంట్

Share this post with your friends

HarishRao: మరో ఐదేళ్లయినా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదు. ఇది తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్ రావు చేసిన కామెంట్. సిద్దిపేట జిల్లాలో పర్యటించిన హరీష్ రావు చిన్న కోడూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. ఆ సమయంలో పోలవరం ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావించారు.ఆ ప్రాజెక్టును మరో ఐదేళ్లయినా పూర్తి చేయలేరన్నారు. పోలవరం పనుల పురోగతిపై అక్కడి ఇంజినీర్లతో మాట్లాడానని చెప్పారు. కాళేశ్వరం కంటే ముందే పోలవరం పనులు ప్రారంభించారని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు తెలంగాణ ప్రజలకు అందుతున్నాయన్నారు. కానీ కేంద్రం చేపట్టిన జాతీయ ప్రాజెక్టు పోలవరం మాత్రం పూర్తి కాలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్ష పార్టీలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని హరీష్ రావు మండిపడ్డారు. ఢిల్లీలో, హైదరాబాద్‌ పార్టీ కార్యాలయంలో కూర్చుని మాట్లాడే విపక్ష నేతలకు ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. గ్రామాల్లోకి వెళ్లి చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కలుగుతున్న ప్రయోజనాలు కనిపిస్తాయని హరీష్ రావు స్పష్టం చేశారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News