E-Paper
Advertisement

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

Upasana Peddi Premiere: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ ఇప్పటికే ఓవర్సీస్, ప్రత్యేక ప్రీమియర్ల రూపంలో ప్రేక్షకులకు ముందుకు వచ్చేసింది. మొదటి ఆట నుంచే ఈ సినిమా బ్లాక్‌బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. వింటేజ్ రామ్ చరణ్‌ను దర్శకుడు చూపించిన విధానం, థియేటర్లలో పూనకాలు తెప్పించే ఎలివేషన్లకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అయితే, ఈ సినిమా ప్రీమియర్ షోలో ఒక ఊహించని, అద్భుతమైన దృశ్యం అందరి దృష్టిని ఆకర్షించింది. రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని కొణిదెల, థియేటర్‌లో ఒక సాధారణ అభిమానిలా మారిపోయి చేసిన హంగామా ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Read also-Podarillu Today Episode : అడ్డంగా బుక్కయిన ప్రతాప్.. మాధవ్ దెబ్బకు మైండ్ బ్లాక్.. అన్నదమ్ముల సీన్ హైలెట్..

ఫ్యాన్స్‌కే పూనకాలు తెప్పించిన ఉపాసన ఎంట్రీ!

సినిమాలో రామ్ చరణ్ (పెద్ది) మాస్ ఎంట్రీ సీన్ పడడమే ఆలస్యం.. థియేటర్ మొత్తం ఈలలు, గోలలతో మారుమోగిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఉపాసన, మెగా హీరోల మాస్ సెలబ్రేషన్స్ స్టైల్‌లో సీట్ నుంచి లేచి నిలబడ్డారు. తన చేతిలో ఉన్న పేపర్లను గాల్లోకి విసురుతూ, కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. సాధారణంగా చాలా హుందాగా, బిజినెస్ ఉమెన్‌గా కనిపించే ఉపాసన.. ఇలా మాస్ ఆడియన్స్‌లా పేపర్లు ఎగరేస్తూ ఎంజాయ్ చేయడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. “స్క్రీన్‌పై చరణ్ బాబు ఎంట్రీ ఇస్తే.. థియేటర్‌లో ఉపాసన గారి ఎనర్జీ నెక్స్ట్ లెవెల్! మెగా కోడలు అంటే ఆ మాత్రం ఉండాలి మరి!” అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియో..

ఉపాసన థియేటర్‌లో పేపర్లు చల్లుతూ ఎంజాయ్ చేస్తున్న ఈ వీడియోను అక్కడి వారు మొబైల్‌లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది. ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈ వీడియో ‘పెద్ది’ హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మరియు మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. “భర్త సినిమాకు ఇంతకంటే బెస్ట్ సపోర్ట్ ఏముంటుంది” అని కొందరు అంటుంటే.. “చరణ్ యాక్టింగ్‌కు కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇంట్లో వాళ్లు కూడా ఫిదా అయిపోయారు” అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.

Read also-Karthika Deepam 2 Serial Today Episode June 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సుమిత్ర బర్తుడే పార్టీకి వెళ్లిన దక్షిణమూర్తి

బ్లాక్‌బస్టర్ టాక్‌తో

భారీ అంచనాల మధ్య విడుదలైన ‘పెద్ది’ చిత్రం చరణ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. యాక్షన్ ఎపిసోడ్స్, చరణ్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఇటు థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురుస్తుండగా, అటు ఉపాసన వైరల్ వీడియో సినిమా మైలేజ్‌ను మరింత పెంచేసిందని చెప్పొచ్చు.

Related News

‘రైరై రారా’ సాంగ్‌కు థియేటర్లోనే పూనకాలు.. ‘పెద్ది’ లేడీ ఫ్యాన్ మాస్ అరాచకం!

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

Big Stories

×