Drinking Water: వాకింగ్ ఆరోగ్యానికి చాలా మంచిది కానీ అతిగా చేస్తే మాత్రం ప్రమాదకరం. చాలామంది ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తుంటారు. వాకింగ్ పూర్తి అయిన వెంటనే వాటర్ తాగుతుంటారు. అలా తాగడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే వాకింగ్ చేసేటప్పుడు మన గుండె వేగం ఎక్కువగా ఉంటుంది దీని ద్వారా వెంటనే నీరు తాగితే గుండెకు హాని కలిగిస్తుందని చేప్తున్నారు.
అయితే వాకింగ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది మరియు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అలగే రక్తపోటు తగ్గించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో మరియు బరువును తగ్గించడంలో వాకింగ్ చాలా ఉపయోగపడుతుంది. ఇలా నడక తర్వాత శరీరం కొంత శక్తిని కోల్పోతుంది. శారీరక శ్రమ వల్ల చెమట కూడా పడుతుంది.
నడక పూర్తి అయిన వెంటనే నీళ్లు తాగకుండా కొంత సమయం తర్వాత నీరు తాగితే శరీరానికి హాయిగా మెదడుకు ప్రశాంతంగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శరీరం కండరాల పనితీరుకు, శక్తి స్టాయిలకు, సాధారణ పునరుద్దరణ కోసం నీరు తగినంత తాగాలని తెలిపారు. శరీరానికి సరిపడా నీరు అందకపోతే తలనొప్పి, అలసట, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
Also Read: చిన్నారుల్లో కాల్షియం లోపిస్తే ఇన్ని సమస్యలు వస్తాయా..?
ఉదయం నిద్రలేవగానే వాటర్ త్రాగడం వల్ల మెదడు రోజంతా హాయిగా పనిచేస్తుంది. నడక నుంచి వచ్చాక దాహం వేస్తేనే వాటర్ తాగాలి అని కాకుండా కాస్తా సమయం తర్వాత కనీసం గ్లాసు వాటర్ అయిన తాగాలి. శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండాలంటే వాటర్ బాగా త్రాగాలని లేదంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు.
వాకింగ్ చేసిన తర్వాత మీ కండరాలలో నొప్పిని కలిగిస్తుంది. దీని నివారణకు నీరు త్రాగితే కండరాల నొప్పిని తగ్గిస్తుంది. నీరు తాగడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది, మీ ముఖం కాంతివంతంగా మారుతుంది మరియు మీ మెుత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది.