Gods and Their Vehicle : దేవలోకంలోని మహిమాత్ములైన దేవతలకు భూలోకంలోని సామాన్య జంతువుల వాహనంగా ఉండటం అందరికీ ఆశ్చర్యంగానే ఉంటుంది.దుర్గాదేవికి సింహం, పరమశివునికి ఎద్దు, విష్ణుమూర్తికి గ్రద్ధ, బ్రహ్మకు హంస, వినాయకునికి మూషికం, లక్ష్మికి గుడ్లగూబ, యముడికి దున్నపోతు, ఇంద్రునికి ఏనుగు, పార్వతికి పులి, శనీశ్వరునికి కాకి, కామాక్షికి కాకి, భైరువునికి కుక్క, సూర్యుడుకి గుర్రం ఇలా చాలామంది దేవానుదేవతలకు భూలోక ప్రాణులు వాహనాలుగా ఉన్నాయి.
బుద్ధావతారం వరకు ఆర్య ద్రావిడులంతా మాంసాహారులే. బ్రాహ్మణులు కూడా యజ్ఞయాగాల సమయంలో బలిపశువు మాంసం ప్రవిత్రమైనదిగా భావించి తినేవారట . మహర్షులు కూడా కొందరు తిన్నారని అంటారు.
క్రీస్తు జననం నాటికి భూమి మీద ఉన్న మనుషులు కేవల పది కోట్లు మాత్రమే. అప్పుడు విపరీతమైన అడవులు, భూమినంతా ఆక్రమించి ఉండేది. అంటే వేతకాలం నాడు ప్రపంచ జనాభా ఒక కోటి కన్నా తక్కువగా ఉండేదంటే నమ్మశక్యం కాదు. ప్రతీ నెలకు నాలుగు పెద్ద వర్షాలు కురిసేవి. అంటే వారానికి ఒక వర్షం కురిసేదన్నమాట. ఇవన్నీ నమ్మగలమా..లేదు నమ్మలేం.
బుద్ధుని రాకతో హింసాప్రదమైన యజ్ఞయాగాలు నిలిచిపోయాయి. అహింసా ధర్మం ప్రారంభమైంది. జీవహింసను మాన్పించి మాంసాహారం నుంచి హిందువులను శాకాహారం వైపు మళ్లించడానికి మూగజీవులను దేవుళ్లకి వాహనాలుగా చిత్రించాల్సి వచ్చింది. దేవుళ్ల వాహనాలైన ప్రాణుల్ని చంపరాదని బోధించడానికి ఇలా చేయాల్సి వచ్చింది. అహింసా పరమో ధర్మ: