Big Stories

MGM Hospital : ఎంజీఎం ఆసుపత్రిలో పాములు, ఎలుకలు..

MGM Hospital : వరంగల్ MGM హాస్పిటల్… పాములు, ఎలుకలకు ఆవాసంగా మారింది. ఏడు నెలల క్రితం RICUలో పేషెంట్ శ్రీనివాస్‌ను ఎలుక కరవడంతో తీవ్రరక్తస్రావమై ప్రాణాలు కోల్పోయాడు. అప్పుడు ప్రభుత్వం సీరియస్ అయి… ఇద్దరు డాక్టర్లను సస్పెండ్ చేయడంతో పాటు సూపరింటెండెంట్ శ్రీనివాసరావును బదిలీ చేసింది. అప్పట్లో ఆ ఘటన సంచలనం సృష్టించింది.

- Advertisement -

ఎలుకల నివారణకు చర్యలు చేపట్టామని మెడికల్ ఆఫీసర్లు చెబుతున్నా.. తరచూ కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు పేషెంట్లు ఉన్న వార్డుల్లోకి పాములు వస్తున్నాయి. పది రోజుల క్రితం క్యాన్సర్ వార్డ్ వద్ద బాత్రూంలోకి నాగుపాము వచ్చింది. పాములు పట్టేవాళ్లను తీసుకొచ్చి.. ఆ పామును పట్టించారు. రెండు రోజుల క్రితం సర్జికల్ వార్డులోని పేషంట్ల బెడ్ల కిందకు నాగుపాము చేరింది. పేషంట్ల వార్డుల్లోకి పాము రావడంతో రోగులు, వారి బంధువులు, వైద్య సిబ్బంది భయపడుతున్నారు. ప్రాణాలు అరచేతులో పెట్టుకుని పరుగులు తీశారు. ఓ పేషెంట్ బంధువే ఆ పామును కొట్టి చంపాడు.

- Advertisement -

MGM హాస్పిటల్ భవనం పాతది కావడం, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో పాటు ఆవరణలో చెట్లు ఎక్కువై చిత్తడిగా ఉంది. ఈ పరిస్థితులు ఎలుకలు, పాములు ఆవాసంగా మార్చుకునేందుకు అనుకులంగా ఉన్నాయి. అనారోగ్యంతో వైద్యం కోసం ఆసుపత్రికి వస్తే.. భగవంతునిపై భారం వేసి చికిత్స పొందాల్సిన దుస్థితి ఏర్పడిందని పేషెంట్లు ఆవేదన చెందుతున్నారు.

పది రోజుల్లోనే రెండు పాములు వార్డులోకి రావడంపై ప్రభుత్వం అప్రమత్తమైంది. హాస్పిటల్‌లో పాముల కలకలంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు… సూపరింటెండెంట్ కు ఫోన్ చేసి ఆరా తీశారు. పాములు రాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆవరణలో చిత్తడి లేకుండా సానిటేషన్ పనులు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని సూపరింటెండెంట్ తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News