Big Stories

Team India : టీమిండియాకు ఫుడ్ ప్రాబ్లమ్!

Team India : భోజనం సహా ఏదైనా తినేటప్పుడు… వేడివేడిగా తింటే ఆ టేస్టే వేరు. ఆరోగ్యపరంగా కూడా తాజా వేడి ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచింది. అందుకే మన దేశంలో చాలా మంది దేన్నైనా వేడివేడిగా తినడానికే ఇష్టపడతారు. ఎప్పుడో ఒకసారి చల్లబడిన పదార్థాలు తీసుకోవాల్సి వస్తే… సరే లెమ్మని సర్దుకుపోతారు. కానీ.. ఎప్పుడూ అలా సర్దుకుపోయి చల్లని పదార్థాలే తినమంటే… ఎవరికైనా కాలుతుంది. ఇప్పుడు టీమిండియా ఆటగాళ్లది కూడా అదే పరిస్థితి.

- Advertisement -

T20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత ఆటగాళ్లు… ప్రాక్టీస్ సెషన్ తర్వాత వడ్డించే భోజనంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కోల్ట్ శాండ్ విచ్ లతో పాటు… ఫలాఫెల్ అనే బీన్స్ వేపుడుని కూడా చల్లగానే వడ్డిస్తుండటంతో… వాటిని తినేందుకు చాలా మంది ఆటగాళ్లు ఇష్టపడటం లేదని ప్రచారం జరుగుతోంది. మంగళవారం ప్రాక్టీస్‌ తర్వాత గ్రౌండ్‌ సిబ్బంది అవే పదార్ధాల్ని తీసుకురావడం చూసి… చాలా మంది వాటిని తినకుండా వెనక్కిపంపేశారు. ఏదో ఒకటి రెండుసార్లు సర్దుకుపోవచ్చు కానీ… రోజూ చల్లని పదార్థాల్ని ఎలా తినాలంటూ భారత ఆటగాళ్లు ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

ICC నిర్వహించే మెగా టోర్నమెంట్లలో… నిబంధనల ప్రకారం అన్ని జట్ల ఆటగాళ్లందరికీ ఒకే రకమైన భోజనం అందిస్తారు. మిగతా జట్ల ఆటగాళ్లు కోల్డ్ శాండ్ విచ్ సహా పెట్టిన పదార్ధాల్ని ఏ వంకా పెట్టకుండా తినేస్తున్నారు. చల్లని పదార్ధాలు తినడం వాళ్లకు అలవాటు కాబట్టి ఎలాంటి అభ్యంతరాలూ లేవు. కానీ… వేడి పదార్ధాలు తినే అలవాటు ఉన్న భారత ఆటగాళ్లు… చల్లని పదార్ధాల్ని తినలేకపోతున్నారు. BCCI ఈ అంశాన్ని ICC దృష్టికి తీసుకెళ్లడంతో… సమస్యను పరిశీలిస్తున్నామని… త్వరలోనే పరిష్కరిస్తామని ICC హామీ ఇచ్చినట్లు సమాచారం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News