BigTV English

French Kiss : ‘ఫ్రెంచ్ కిస్‌’ కిక్కే వేరు.. ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

French Kiss : ప్రేమను వ్యక్తం చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. అందులో ముద్దు కూడా ఒకటి అంటారు. అయితే ఒక్కో ముద్దుకు ఒక కారణం ఉంటుంది. ప్రేమికులు, భార్యభర్తలు పెట్టుకునే ముద్దు నుంచి.. పిల్లలకు పెద్దలు పెట్టే ముద్దు వరకు ప్రతిది ప్రత్యేకమే. ఒకరి పెదాలు మరో వ్యక్తి తనువును ఎక్కడ ముద్దాడిన అది ప్రేమే.

French Kiss : ‘ఫ్రెంచ్ కిస్‌’ కిక్కే వేరు.. ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

French Kiss : ప్రేమను వ్యక్తం చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. అందులో ముద్దు కూడా ఒకటి అంటారు. అయితే ఒక్కో ముద్దుకు ఒక కారణం ఉంటుంది. ప్రేమికులు, భార్యభర్తలు పెట్టుకునే ముద్దు నుంచి.. పిల్లలకు పెద్దలు పెట్టే ముద్దు వరకు ప్రతిది ప్రత్యేకమే. ఒకరి పెదాలు మరో వ్యక్తి తనువును ఎక్కడ ముద్దాడిన అది ప్రేమే.


అయితే మనం ముద్దును మద్దు అని పిలుస్తాం. లేదా ఇంగ్లీష్‌లో “కిస్” అంటాం. ప్రేమికులు కాస్త బిగి కౌగిళితో పెట్టుకునే ముద్దును “స్మూచ్” అని కూడా అంటారు. ఏ ముద్దుకు ప్రత్యేకమైన పేరంటూ ఉండదు. కానీ ఫ్రెంచ్ కిస్ మాత్రం వేరనే ఫీలింగ్ అందరిలోనూ ఉంటుంది. ప్రపంచంలో మరెవ్వరూ ఫ్రెంచ్ వారిలా ముద్దు పెట్టుకోలేరంట. అయితే ఆ ముద్దును “ఫ్రెంచ్ కిస్” అని పిలవడానికి ప్రపంచ యుద్దానికి లింక్ ఉందట.

ఫ్రెంచ్ కిస్ అనేది ఒక ప్రత్యేకమైన ముద్దు. ఈ ముద్దులో పాల్గొనేవారి నాలుగు పెదవులు కులుసుకుంటున్న సమయంలో వారి రెండు నాలుకల ఆ పెదాల మధ్యలో నాట్యమాడుతూ ఉంటాయి. ఫలితంగా ఇవి లైంగిక ప్రేరేపణను ప్రేరేపిస్తాయి. ఇదే సమయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న బంధం యొక్క ఘాడతను ఈ “ఫ్రెంచ్ కిస్” తెలియజేస్తుంది.


అసలు ఫ్రెంచ్ కిస్‌కు ఆపేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం..

అది మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం. అమెరికా, బ్రిటీష్ సైనికులకు ఫ్రాన్స్‌లో మంచి ఆతిథ్యం లభించిందట. ఆ సమయంలో సైనికులకు ఫ్రాన్స్ మహిళలతో సంబంధం ఏర్పడి ఓ తీపి గుర్తుగా మిగిలిపోయింది. అంటే.. అక్కడి మహిళలు పెట్టే ముద్దు ఆ స్థాయిలో ఉండేదన్నమాట. సాధారణంగా బ్రిటీషర్లు, అమెరికన్లు గౌరవ సూచికగా పెదాలతో ముద్దు పెట్టుకుంటారు. పెదాలు టచ్ అయ్యీ అవ్వనట్లుగా ఉంటుంది ఆ ముద్దు.

కానీ ఫ్రాన్స్ మహిళలు మాత్రం అందుకు భిన్నంగా ముద్దు పెట్టేవారట. నోరు తెరిచి.. నాలుక- నాలుక కలిసేలా గాఢమైన ముద్దు పెట్టేవారట. పచ్చిగా చెప్పాలంటే అదో చిన్నసైజు “టంగ్ వార్”. ఇలా ఆ మహిళలు పెట్టే ఆ ముద్దు ఎంతో ఉద్వేగభరితంగా ఉండటంతో.. దానికి “ఫ్రెంచ్ కిస్” అని పేరుపెట్టారు. రెండో ప్రపంచ యుద్ధ సమయానికి ఫ్రెంచ్ కిస్ ఎల్లలు దాటింది. ఫ్రాన్స్ నుంచి తమ దేశాలకు తిరిగి వెళ్లిన సైనికులు ఈ ఫ్రెంచ్‌ కిస్‌ను అక్కడివారికి పరిచయం చేశారట. అలా వార్ కోసం వెళ్లినవారు.. ఫ్రాన్స్ లో “టంగ్ వార్” ట్రెండ్ తెలుసుకుని బాగా అలవాటుపడ్డారంట.

చిత్రం ఏమిటంటే.. ఈ ముద్దును అమెరికా, గ్రేట్ బ్రిటన్ లలో ఫ్రెంచ్ కిస్ అని పిలిస్తే ఫ్రాన్స్ లో మాత్రం అన్ బైసర్ అమోరియక్స్ (ప్రేమికుల ముద్దు) లేదా అన్ బైసర్ అవెక్ లా లాంగ్యూ (నాలుకతో ముద్దు) అని పిలుస్తారు. సాధారణంగా ఫ్రెంచ్ ప్రజలు శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకే పారిస్ నగరాన్ని “సిటీ ఆఫ్ లవ్” అని పిలుస్తారు. ఫ్రెంచ్ కిస్ అనే పదం ఇంగ్లీష్ భాషలో చేర్చబడిందని షెరియల్ కిర్షెన్‌బామ్ అనే రచయిత 1923 లో “సైన్స్ ఆఫ్ కిస్సింగ్” పుస్తకంలో పేర్కొన్నారు. 2013లో తొలిసారిగా ఫ్రెంచ్ కిస్‌ను అధికారిక పదంగా స్థానం కల్పించారు.

ఆల్ఫైడ్ కిన్సే అనే శాస్త్రవేత్త ప్రకారం.. ముద్దు అనేది ఒక వ్యక్తి విద్యా స్థాయిని బట్టి ఉంటుంది. ఫ్రెంచ్ కిస్‌ను “మోస్ట్ ఫ్యాషనేట్ కిస్” అని అంటారు. ఫ్రెంచ్ కిస్ క్యాలరీలను బర్న్ చేయడానికి ఉపయోగపడుతుందని అనేక అధ్యయనాలలో వెల్లడైంది. అది ఫ్రెంచ్ కిస్ వెనుకున్న మేటర్.. ఫ్రాన్స్ అమ్మాయిలా మజాకా..!

Tags

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×