E-Paper
Advertisement

Maha Ashtami:- మహా అష్టమి ప్రత్యేకతేంటి…

Maha Ashtami:- మహా అష్టమి ప్రత్యేకతేంటి…
Advertisement

Maha Ashtami:- ఈ సారిచైత్ర నవరాత్రులు చాలా ప్రత్యేకమైనవి. హిందూ నూతన సంవత్సరం చైత్ర నవరాత్రుల నుండే మొదలైంది. దేశమంతటా నవరాత్రి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. నవరాత్రులలో రెండు ముఖ్యమైన రోజులు అష్టమి, నవమి. ఈ రెండు రోజుల్లో ప్రజలు ఉపవాసం ఉంటారు. ఇంట్లో పెళ్లికాని అమ్మాయిల్ని దుర్గామాతగా భావిస్తారు.

అష్టమిని దుర్గాష్టమి, మహా అష్టమి అని కూడా అంటారు. నవ రాత్రులలో ఎనిమిదో రోజున అమ్మ మహాగౌరీని పూజిస్తారు. మహా ష్టమి నాడు 9 చిన్న కుండలను ఏర్పాటు చేస్తారు. వాటిలో దుర్గామాత యొక్క తొమ్మిది శక్తులను ఆవాహన చేసి అమ్మవారి 9 తొమ్మిది రూపాలను పూజిస్తారు. స్వచ్ఛత, శాంతికి చిహ్నంగా మహాగౌరిని పరిగణిస్తారు.ఈ సంవత్సరం అష్టమి మార్చి 29న బుధవారం రోజు వస్తోంది. హిందూ క్యాలెండర్ ప్రకారం.. అష్టమి తిథి మార్చి 28న బుధవారం రాత్రి 07:02 గంటలకు ప్రారంభమై మార్చి 29న రాత్రి 09:07 గంటలకు ముగుస్తుంది. ఈ రోజు ఉదయం 04.42 నుంచి 05.29 వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది.

Advertisement

నవమి లేదా మహానవమి అంటే.. నవరాత్రులలో తొమ్మిదో రోజు. మహా నవమి నాడు దుర్గాదేవిని మహిషాసుర మర్దిని రూపంలో పూజిస్తారు. మహానవమి రోజున దుర్గ మాత మహిషా సురుడిని సంహరించిందని నమ్ముతారు. నవరాత్రి తొమ్మిదో రోజున, భక్తులు దుర్గామాత యొక్క తొమ్మిదో అవతారమైన మాతా సిద్ధిదాత్రిని కూడా పూజిస్తారు. ఈ సంవత్సరం నవమి మార్చి 30న గురువారం రోజు వస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం.. నవమి తిథి మార్చి 29న రాత్రి 09:07 గంటలకు ప్రారంభమై మార్చి 30న రాత్రి 11:30 గంటలకు ముగుస్తుంది.

బ్రహ్మ ముహూర్తం ఉదయం 04:41 గంటలకు ప్రారంభమై 05:28 గంటలకు ముగుస్తుంది. అభిజీత్ ముహూర్తం 12.01 నుంచి 12.51 వరకు నడుస్తుంది. గురు పుష్య యోగం, అమృత సిద్ధి యోగం, రవియోగం, సర్వార్థ సిద్ధి యోగం వంటి కొన్ని శుభ యోగాలు కూడా మహానవమి రోజున ఏర్పడ బోతున్నాయి.

Advertisement

చైత్ర నవరాత్రుల్లో ఇలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుందా..

for more updates follow this link:-bigtv

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×