BigTV English

Amritpal Singh: రోజుకో వేషంలో అమృత్ పాల్ సింగ్.. 9 రోజులుగా కొనసాగుతున్న వేట..

Amritpal Singh: రోజుకో వేషంలో అమృత్ పాల్ సింగ్.. 9 రోజులుగా కొనసాగుతున్న వేట..

Amritpal Singh: ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్‌పాల్‌ సింగ్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. 9 రోజులుగా పంజాబ్ పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్న అమృత్‌పాల్‌ సింగ్‌… పూటకో వేషం మారుస్తూ పోలీసులకు బురిడీ కొడుతున్నాడు. అమృత్‌పాల్‌ సింగ్‌ పరారీకి సంబంధించి రోజుకో వీడియో వెలుగులోకి వస్తోంది. తాజాగా పటియాల ప్రాంతంలో ఆయన సంచరిస్తున్నట్లుగా సీసీ ఫుటేజీ దృశ్యాలు వైరల్‌గా మారాయ్‌. ప్యాంటు, కోటు ధరించి ఫోన్లో మాట్లాడుతూ వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. అయితే ఈ వీడియోలో ఉన్నది అమృత్‌పాల్‌ అని పోలీసులు నిర్ధారణకు రాలేకపోతున్నారు. అమృత్‌పాల్‌ సహాయకుడి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్‌లో పలు చిత్రాలున్నాయని పోలీసులు వెల్లడించారు. ఖలిస్థానీ జెండా, ముద్ర, కరెన్సీ, ఆయుధ శిక్షణ పొందుతున్న వీడియోలు అందులో ఉన్నాయని తెలిపారు.


అమృత్‌సర్‌లోని తన బంధువుల ఇంట్లో అమృత్‌పాల్‌ సింగ్‌ గడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడి నుంచి హర్యానాలోని కురుక్షేత్రకు వెళ్లినట్లు పోలీసులు చెప్తున్నారు. కురుక్షేత్ర నుంచి ఢిల్లీ నగరానికి వెళ్లినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయ్‌. ఓ సాధువు వేషంలో ఢిల్లీకి చేరుకున్నట్లు తెలుస్తోంది. కశ్మీరు గేటులోని ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ వద్ద ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల పోలీసులు నిశితంగా గమనిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అమృత్‌పాల్‌ మద్దతుదారుల్లో చాలా మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేసి, వారి నుంచి కత్తులు, ఆయుధాలు, తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

అమృత్‌పాల్‌ వేటపై సిక్కులకు పవిత్రమైన అకాల్‌ తక్త్‌ స్పందించింది. తక్షణమే అతడు లొంగిపోవాలని కోరింది. వారిస్‌ పంజాబ్‌ దే నాయకుడు తక్షణమే పోలీసుల ఎదుట లొంగిపోవాలని అకాల్‌ తక్త్‌ జత్యేదార్‌ జ్ఞాని హర్‌ప్రీత్‌ సింగ్‌ కోరారు. అమృతపాల్‌ను ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడంపై హర్‌ప్రీత్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో పోలీసులు ఉన్నా అమృతపాల్‌ను ఎందుకు పట్టుకోలేకపోయారని ప్రశ్నించారు. అమృత్‌పాల్‌ను ఇంతకు ముందే అరెస్టు చేసి ఉంటే, పోలీసులు ఆ విషయాన్ని బయటపెట్టాలన్నారు. పంజాబ్‌లోని పరిస్థితులపై చర్చించడానికి సిక్కు సంస్థలు, మదర్సాలు, నిహాంగ్ సంస్థలతో ప్రత్యేకంగా సమావేశం కావాలని హర్‌ప్రీత్‌ సింగ్‌ నిర్ణయించారు. అయితే ఈ భేటీకి ఏ రాజకీయ సంస్థ ప్రతినిధులను ఆహ్వానించలేదు. పోలీసులు తమ కుమారుడిని పట్టుకున్నారని అమృతపాల్ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.


Related News

Agni Prime: అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను రైలు నుంచే ఎందుకు ప్రయోగించారు? దాని ప్రత్యేకతలు ఏమిటి?

Ladakh: లద్దాఖ్‌లోని లేహ్‌లో టెన్షన్ టెన్షన్..!

Missile from Rail: దేశంలో తొలిసారి రైలు మొబైల్ లాంచర్.. అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

Big Stories

×