E-Paper
Advertisement

Mallareddy: పవన్ సినిమాలో విలన్‌గా చేయమన్నారు.. నో చెప్పా: మంత్రి మల్లారెడ్డి

Mallareddy: పవన్ సినిమాలో విలన్‌గా చేయమన్నారు.. నో చెప్పా: మంత్రి మల్లారెడ్డి
Advertisement

Mallareddy: కష్టపడ్డా.. పనిచేసినా.. పాలమ్మినా.. పూలమ్మినా.. చిట్‌ఫండ్స్ నడిపినా.. కాలేజీలు పెట్టినా.. సక్సెస్ అయినా డైలాగ్‌తో ఓవర్ నైట్‌లో ఫేమస్ అయ్యారు మంత్రి మల్లారెడ్డి. సోషల్ మీడియాలో ఈ డైలాగ్ రచ్చ చేస్తోంది. సెలబ్రిటీలు కూడా ఈ డైలాగ్‌ను ఇమిటేట్ చేస్తున్నారు. తాజాగా తనకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా తాను వెళ్లలేదని అన్నారు మల్లారెడ్డి.

మేము ఫేమస్ మూవీ టీజర్ లాంఛ్ కార్యక్రమానికి మల్లారెడ్డి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. చిరిగిన బట్టలు వేసుకొని అమ్మాయిల వెంట తిరిగితే యువత ఫేమస్ కాలేరని.. కష్టపడితేనే అవుతురాని మల్లారెడ్డి అన్నారు. సక్సెస్ ఎవరికీ ఊరికేరాదని చెప్పారు. తాను ఎంతో కష్టపడి పాలు, పూలు అమ్మి ఇక్కడి వరకు వచ్చానని చెప్పారు. కేసీఆర్ దయతో మంత్రి అయ్యానని వెల్లడించారు.

Advertisement

గతంలో సినిమాల్లో నటించే అవకాశం తనకు వచ్చినా చేయలేదన్నారు. పవన్ కల్యాణ్ సినిమాలో విలన్‌గా నటించాలని హరీశ్ శంకర్ తన ఇంటికి వచ్చాడని చెప్పారు. గంటపాటు బతిమిలాడారని.. అయినా తాను విలన్‌గా చేయనని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. ఇక రాష్ట్రంలో ఎలక్షన్లు పూర్తయ్యాక తెలంగాణ యాసలో సినిమాలు నిర్మిస్తానని తెలిపారు. తెలంగాణ యాసతో చాలా మంది నటీనటులు ఫేమస్ అయ్యారని వెల్లడించారు.

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×