BigTV English
Advertisement

WhatsApp : వాట్సాప్‌లో ఒకటి ఇన్.. మరొకటి ఔట్..

WhatsApp : వాట్సాప్‌లో ఒకటి ఇన్.. మరొకటి ఔట్..

WhatsApp : వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. అయితే అది ఐఫోన్ యూజర్లకు మాత్రమే. వాట్సాప్‌ ఐఓఎస్ 22.23.0.73 వెర్షన్‌ను ఐఫోన్ యూజర్లు అప్‌డేట్ చేసుకొని… ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చని వాట్సాప్ తెలిపింది. ఎడిట్ మెసేజ్‌ ఫీచర్‌ కావాలంటూ యూజర్లు చాలా రోజుల నుంచి వాట్సాప్‌ను డిమాండ్‌ చేస్తున్నారు. త్వరలోనే మెసేజ్‌ ఎడిట్‌ ఫీచర్‌ను తీసుకొస్తామని గత నెలలో వాట్సాప్ ప్రకటించింది. అన్నట్లుగానే ఆ ఫీచర్ ను తీసుకొచ్చింది. అయితే మెసేజ్‌ ఎడిట్‌ ఫీచర్ కు టైమ్‌ లిమిట్ కూడా ఉండొచ్చని చెబుతున్నారు.


ఇక యూజర్ల వ్యక్తిగత గోప్యత కోసం ఇటీవలే కొత్త ప్రైవసీ ఫీచర్లను ప్రవేశపెట్టింది… వాట్సాప్. ప్రస్తుతం వ్యూ వన్స్ ఫీచర్‌ ద్వారా పంపే ఫైల్స్‌ను యూజర్లు స్క్రీన్‌ షాట్‌ తీయలేరు. కానీ, డెస్క్‌టాప్ వెర్షన్‌లో మాత్రం ప్రింట్ స్క్రీన్‌ లేదా ఇతర టూల్స్‌ సాయంతో వ్యూ వన్స్‌ ద్వారా పంపిన, అందుకున్న మెసేజ్‌లను కొందరు యూజర్లు స్క్రీన్‌ షాట్ తీసుకుంటున్నట్లు వాట్సాప్‌ గుర్తించింది. దీంతో డెస్క్‌ టాప్‌ వెర్షన్‌లో వ్యూ వన్స్ ఫీచర్‌ను తొలగించింది. ఇకపై డెస్క్‌టాప్‌ యూజర్లకు ఈ ఫీచర్‌ అందుబాటులో ఉండదని వాట్సాప్ తెలిపింది. ఇకపై వ్యూ వన్స్ ద్వారా పంపిన మెసేజ్‌లు డెస్క్‌టాప్‌/వెబ్‌ వెర్షన్‌ వాట్సాప్‌లో కనిపించవు. వాట్సాప్ మొబైల్ యాప్‌లో మాత్రమే వాటిని చూసే అవకాశం ఉంటుంది.

యూజర్ల కోసం ఇటీవలే కొన్ని కొత్త ఫీచర్లనూ వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. వాటిలో… ఒకేసారి 32 మందికి వాయిస్‌/వీడియో కాల్స్‌ చేసే ఫీచర్ తో పాటు… 2 జీబీ ఫైల్ షేరింగ్‌, ఇన్‌-చాట్ పోల్‌ సహా… ఒక గ్రూపులో 1024 మందిని సభ్యులుగా చేర్చుకునే సదుపాయాలు ఉన్నాయి.


Tags

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×