Whatsapp : ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్… తాజాగా భారీ సంఖ్యలో ఫేక్ అకౌంట్లను నిషేధించింది.సెప్టెంబర్ 30 వరకు ఏకంగా 26 లక్షల 85 వేల భారతీయుల వాట్సాప్ ఖాతాలను నిషేధించింది. ఇందులో 8 లక్షలకుపైగా వాట్సాప్ అకౌంట్లను ఎలాంటి ఫిర్యాదులూ రాకముందే తొలగించినట్లు వాట్సాప్ వెల్లడించింది.
ఫేక్ వార్తలు, తప్పుడు సమాచార వ్యాప్తిని నిరోధించేందుకు… తప్పుడు, నకిలీ ఖాతాలను బ్యాన్ చేశామని వాట్సాప్ వెల్లడించింది. భారత ఐటీ రూల్స్ 2021కి అనుగుణంగానే ఈ చర్యలు తీసుకున్నామని ప్రకటించింది. ఒక్క సెప్టెంబర్ నెలలోనే ఏకంగా 26 లక్షల 85 వేల భారతీయుల వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించినట్లు నెలవారీ నివేదికలో వెల్లడించింది… వాట్సాప్. 2022 సెప్టెంబర్ యూజర్ సేఫ్టీ రిపోర్ట్‌ను భారత ఐటీ మంత్రిత్వ శాఖకు అందించింది. సెప్టెంబర్‌లో 666 ఫిర్యాదులు అందగా, 23 మందిపై మాత్రమే చర్యలు తీసుకున్నామంది… వాట్సాప్.
గ్రీవెన్స్ ఛానెల్ ద్వారా యూజర్ల కంప్లైంట్లపై స్పందించి చర్యలు తీసుకుంటున్నామని వాట్సాప్ వెల్లడించింది. ప్లాట్‌ఫామ్‌లో హానికర కంటెంట్ రాకుండా చూసుకుంటున్నామని, నష్టం జరిగిపోయాక గుర్తించడం కన్నా… ముందుగా నివారించాలన్నదే తమ ప్రాధాన్యత అని వాట్సాప్ వెల్లడించింది. వాట్సాప్ దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించింది.