Whatsapp New Features : వాట్సాప్ తన యూజర్ల కోసం యాప్ కు సరికొత్త ఫీచర్లను జోడించింది. కమ్యూనిటీస్ అనే ఫీచర్‌ను వరల్డ్ వైడ్‌గా ఎనేబుల్ చేసింది. ఈ విషయాన్ని మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ స్వయంగా ప్రకటించారు. వాట్సాప్ గ్రూప్‌ల నిర్వహణ కష్టంగా మారడంతో.. కమ్యూనిటీస్ ఫీచర్‌పై పనిచేసిన మార్క్ జుకర్ బర్గ్… కొన్ని నెలలుగా బీటా వెర్షన్‌లో విజయవంతంగా ట్రయల్స్ నిర్వహించి… గురువారం నుంచి రియల్ టైం యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
వాట్సాప్‌లో చాలా మంది ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కాలేజ్, ఆఫీస్ అంటూ అనేక గ్రూప్‌లను క్రియేట్ చేసి, వాటిల్లో పోస్టులు పెడుతూ ఉంటారు. అయితే ఫ్రెండ్స్, ఫ్యామిలీకి సంబంధించి వేర్వేరు గ్రూపులు క్రియేట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీ గ్రూప్‌లో ఎన్ని గ్రూప్‌లు ఉంటే… అన్నీ ఒకే గ్రూప్ కింద యాడ్ చేసుకోవచ్చు. అలా అన్నీ గ్రూప్‌లో యాడ్ చేసి.. దానికి ఒక నేమ్ సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్యామిలీ గ్రూప్‌లో ఫ్యామిలీ గ్రూప్‌లు, కాలేజీ గ్రూప్‌లో కాలేజీ గ్రూప్‌లు.. ఫ్రెండ్స్ గ్రూప్ లో ఫ్రెండ్స్ గ్రూప్‌లు… ఇలా కమ్యూనిటీస్ ఫీచర్ ద్వారా అన్నీ డివైడ్ అయిపోతాయి. గ్రూపుల్ని డివైడ్ చేయడం వల్ల వాట్సాప్ ను సులభంగా ఆపరేట్ చేయొచ్చని మార్క్ జుకర్ బర్గ్ అంటున్నాడు.
కమ్యూనిటీస్ ఫీచర్‌తో పాటు గ్రూప్ చాట్‌లో పోల్స్ క్రియేట్ చేయడం, ఒకేసారి 32 మంది సభ్యులకు గ్రూప్ వీడియో కాల్ చేయడం వంటి ఫీచర్లను వాట్సాప్ కు జోడించారు. ఇప్పటిదాకా ఒక గ్రూప్‌లో సభ్యుల సంఖ్య 512 మంది దాకా ఉండే ఛాన్స్ ఉండగా… ఇప్పుడా సభ్యుల సంఖ్యను 1,024కు పెంచారు. దీనివల్ల వ్యాపార వేత్తలు తమ క్లయింట్లకు పెద్ద సంఖ్యలో మెసేజ్ పంపడంతో పాటు… వ్యాపార కార్యకలాపాల్ని మరింత వృద్ధి చేసుకోవచ్చని వాట్సాప్ చెబుతోంది.