BigTV English

Red Chili or Green Chili: ఎండుమిరప, పచ్చిమిరప ఇందులో ఏది బెటర్‌?

Red Chili or Green Chili: ఎండుమిరప, పచ్చిమిరప ఇందులో ఏది బెటర్‌?

Red Chili or Green Chili:మనం ప్రతిరోజు కూరల్లో పచ్చిమిరపకాయలను వేసుకొని వండుకుంటూ ఉంటాం. అయితే కొందరు పండుమిరపకాయలను కూడా వాడుతారు. ఈ రెండిటిలో ఏది మంచిది, ఎందులో అసలు పోషకాలు ఎక్కువగా ఉంటాయి అనే సందేహం మనకు వస్తుంది. అయితే ఈ రెండు మిరపకాయలు కూడా ఆరోగ్యకరమైన ప్రయోజనాలను మనకు అందిస్తాయి. పోషకాల విషయానికి వస్తే పండుమిరపలో అధికంగా పోషకాలు ఉంటాయి. విటమిన్ సి, బీటా కెరోటిన్, విటమిన్ ఏ, బి ఇలా చాలా రకాల ఖనిజాలు ఇందులో ఉంటాయి. ఈ పండు మిరపకాయలను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్లతో పోరాడే ఔషధ గుణాలు పండుమిరపలో అధికంగా ఉంటాయి. ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా కూడా ఇవి అడ్డుకుంటాయి. జీర్ణ వ్యవస్థలో ఉండే హానికర బ్యాక్టీరియాలను నిర్మూలిస్తాయి. పండుమిరప తినడం వల్ల ఆకలి బాగా పెరుగుతుంది. రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. దీంతో మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తనాళాల్లో ఉండే కొవ్వు ఈ పండు మిరప తినడం వల్ల కరుగుతుంది. అంతేకాకుండా జలుబు, జ్వరం తగ్గిపోతాయి. నొప్పులు, వాపుల నుంచి కూడా మంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థరైటిస్, సోరియాసిస్, డయాబెటిస్ లాంటి సమస్యలు ఉన్నవారు పండుమిరపలను తినడం వల్ల ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. పండుమిరపకాయలు జీర్ణశక్తిని పెంపొందిస్తాయి. జీవ క్రియ బాగా జరిగేలా చూస్తాయి. బరువును నియంత్రించడంలో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల శరీరంలో శక్తి ఎక్కువగా ఖర్చవుతుంది. వ్యాయామం చేసినంత ఫీలింగ్ ఉంటుంది. క్యాలరీలు కూడా ఖర్చయిపోతాయి. దీంతో అధిక బరువు తగ్గుతారు. ఆస్తమా, సైనస్, జలుబులాంటి సమస్యలు ఉన్నవారు పండుమిరపకాయలను తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఊపిరితిత్తులు, గొంతు, ముక్కులో ఉండే శ్లేష్మం కూడా కరిగిపోతుంది. తలనొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×