Big Stories

Human Values : ప్రతీ 60 ఏళ్లకు మానవ ధర్మాలు ఎందుకు మారతాయి?

కృత, త్రేతా, ద్వాపర యుగాల్లో మానవ ఆయుర్దాయం 180 . అదే కలియుగానికి వచ్చేసరికి మానవుడి ఆయుష్షు 120లకి పడిపోయింది.అందుకే 60 సంవత్సరాలు పూర్తికాగానే షష్టిపూర్తి నిర్వహిస్తారు.

- Advertisement -

నారదుడు పుత్రులు 60 మంది యుద్ధంలోమరణించడం వల్ల శోకసంద్రంలో ఉన్న నారదుడికి విష్ణుమూర్తి వరమిస్తాడు.నీ 60 మంది పుత్రులు ఈ కాల చక్రంలో నిరంతరం తిరుగుతూ ఉంటారని వరం ఇవ్వడంతో మనకు తెలుగు సంవత్సరాలు 60 గా ఉన్నాయి.ఈ క్రమంలోనే మనిషి 60 సంవత్సరాలకు చేరుకోగానే అతనికి ఈ లోక సంబంధ విషయాలు పూర్తయినట్లే.

- Advertisement -

60 ఏళ్లకోసారి మనోధర్మాలతోపాటు పాటుగా మానవ ధర్మాలు మార్పు చెందుతుంటాయి. బుద్ధి శక్తి కూడా అరవై సంవత్సరాలు మాత్రమే. నిరాకంటంగా ఉంటుంది. అరవై తర్వాత క్రమంగా జ్ఞాపకశక్తి క్షీణించిపోతుంటుంది. శరీరంలోని కండరాలన్నీ కరిగిపోవటం ప్రారంభిస్తాయి.

60 ఏళ్ల సంవత్సరాల లోపల మృత్యుశక్తి ఒకసారి తన ప్రభావం చూపిస్తుందట. ఏదో విధకమైన ఏదో రకమైన ప్రాణాపాయం దగ్గరగా వచ్చి వెళ్తుందన్నమాట. అరవై తర్వాత ప్రతీ పది సంవత్సరాలకు మృత్యుశక్తి పలకరిస్తూనే ఉంటుంది.

ప్రతీ కొడుకు అరవై సంవత్సరాలు వచ్చిన తండ్రిని తన బిడ్డలతో సమానంగా చూసుకోవాలని ధర్మశాస్త్రం చెబుతోంది. అందరి తల్లి తండ్రులకు అంతటి అదృష్టం ఉండకపోవచ్చు.

ఆరుపదుల జీవితాన్ని ఎవరైతే ఆనందంగా గడుపుతారో వారి జీవితం ధన్యమనే చెప్పవచ్చు. ఆ జ్ఞాపకార్థమే బిడ్డలు, మనవళ్లు, బంధువులు మిత్రులు అందరూ కలిసి షష్టి పూర్తి పండుగను చూసి సంబరాలు పంచుకుంటారు. వేదాలు అరవై సంవత్సరాలను మాత్రమే నిర్దేశించిన కారణమిదే.

బృహస్పతి , శని 30 సంవత్సరాలకు మానవుని జన్మకాలంలో ఉన్నరాశికి చేరటానికి 60 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళిద్దరూ తాము బయలుదేరిన రాశికి చేరుకోవటంతో మానవుని జీవితం మరలా ప్రారంభమైనట్టు సంకేతం..

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News