BigTV English
Advertisement

Underwear : ఇన్నర్‌వేర్స్ కొనడం మానేసిన ఇండియన్స్.. వేసుకోవడం మానేశారా..!

Underwear : పండగల సీజన్ వచ్చేసింది. దీంతో బట్టలు కొట్టులు ఆఫర్లు మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇక షాపింగ్ చేయాలంటే ఎక్కడ డిస్కౌంట్లు ఎక్కువగా లభిస్తాయో ఆరా తీసి అక్కడికి వెళ్తారు. పార్టీ వేర్ నుంచి ఆఫీస్ దుస్తుల వరకు ఈ పండుగలకే కొనుగోలు చేస్తారు. అయితే వినియోదారుల కొనుగోలు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

Underwear : ఇన్నర్‌వేర్స్ కొనడం మానేసిన ఇండియన్స్.. వేసుకోవడం మానేశారా..!

Underwear : పండగల సీజన్ వచ్చేసింది. దీంతో బట్టలు కొట్టులు ఆఫర్లు మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇక షాపింగ్ చేయాలంటే ఎక్కడ డిస్కౌంట్లు ఎక్కువగా లభిస్తాయో ఆరా తీసి అక్కడికి వెళ్తారు. పార్టీ వేర్ నుంచి ఆఫీస్ దుస్తుల వరకు ఈ పండుగలకే కొనుగోలు చేస్తారు. అయితే వినియోదారుల కొనుగోలు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.


అదేంటంటే.. ఇండియన్స్ అన్ని రకాల దుస్తులు కొంటున్నారు కానీ.. ఇన్నర్‌వేర్‌లను కొనడం లేదట. దీంతో పెద్దపెద్ద కంపెనీలు భారీ నష్టాలు చూడాల్సి వస్తుందని లబోదిబోమంటున్నారు. నిజానికి ఇండియన్స్ ఇన్నర్‌వేర్ వేసుకోవడం.. ఈ 50 ఏళ్లలో అలవాటు చేసుకున్నారు.

ఇండియా భిన్న సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలతో ఉంటుంది. ఇండియాలో పుట్టిన ఆచార సాంప్రదాయాలను ప్రపంచ దేశాలు కూడా ఇష్టపడతాయి. ఇప్పటికే విదేశీయులు చీరలు, ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్సులు ధరిస్తూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. పురుషులు కూడా దోవతిని గోచి పెట్టుకునేవారు లేకపోలేదు. కానీ మన దేశంలో కొన్ని ప్రాంతాల వారు విదేశీయుల మాయలో పడి చీరలు పక్కనబెట్టి డ్రెస్‌లు ధరిస్తున్నారు.


తాజాగా ఇండియన్స్ ఇన్నర్‌వేర్‌లను కొనడం చాలా తగ్గించారని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. పార్టీవేర్ నుండి ఆఫీస్, సాధారణ దుస్తులు, అన్నీ రకాల బట్టలు ప్రజలు కొంటున్నారు. కానీ వారి జాబితాలో ఇన్నర్‌వేర్లు మాత్రం ఉండటం లేదని పేర్కొంది. జాకీ గత సంవత్సరం మొదటి త్రైమాసికంతో పోలిస్తే.. ఆదాయం 7.5 శాతం పరిమాణాంలో 11.5 శాతం క్షీణించిందని తెలిపింది. డాలర్, రూప మిగిలిన కంపెనీలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బనం కారణంగా ప్రజల వద్ద డబ్బు లేకపోవడమే అమ్మకాలు తగ్గడానికి కారణంగా భావిస్తున్నారు.

అలానే ఇండియన్స్ ఎక్కువగా ఆన్‌లైన్ మార్కెట్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆన్‌లైన్ స్టోర్లు ఎక్కువ డిస్కౌంట్లు ఇవ్వడమే దీనికి కారణం. అదే సమయంలో మల్టీ బ్రాండ్ ఔట్ లెట్లు MBO గతంలో కొనుగోలు చేసిన స్టాక్‌ను కొనుగోలు చేయడం లేదని స్థానిక దుకాణదారులు చెబుతున్నారు. ఇండియాలో ఇన్నర్‌వేర్ మార్కెట్ విలువ దాదాపుగా 5.8 బిలియన్ డాలర్లు లేదా రూ.48,123 కోట్లు అంచనా. ఇందులో మహిళల వాటా 61 శాతం కాగా.. పురుషులది 31 శాతంగా ఉంది.

Tags

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×