Wipro and Infosys:ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా టెక్కీలను భారీ సంఖ్యలో తొలగిస్తున్నాయి… ఐటీ కంపెనీలు. కొన్ని దేశీయ కంపెనీలు కూడా అదే బాటలో ఉన్నాయి. ఇటీవలే విప్రో కొందరు ట్రైనీలను తీసేయడంతో పాటు మరికొందర్ని సగం జీతానికే పనిచేయమని అడగడం తీవ్ర వివాదానికి దారి తీసింది. మరోవైపు టీసీఎస్ కూడా… ట్రైనీలకు ఇంకా ప్రాజెక్టులు అప్పగించాల్సి ఉందని చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో… ఇన్ఫోసిస్, విప్రో ఈ ఏడాది ఫ్రెషర్లను నియమించుకోకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. 2022తో పోలిస్తే… 2023లో నియామకాలు భారీగా తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏకంగా 50 శాతం క్షీణించవచ్చని చెబుతున్నారు.
2023లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకునే విద్యార్థులకు… ఇన్ఫోసిస్, విప్రో ఇంకా క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించలేదు. దిగ్గజ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల్లో కూడా ఆ రెండు కంపెనీలు క్యాంపస్ సెలక్షన్స్ జరపకపోవడం… నిపుణుల్ని ఆశ్చర్యపరుస్తోంది. గత ఏడాది నియమించుకున్న వారిలో ఎక్కువ మంది బెంచ్ మీద ఉండటం కూడా… తాజాగా నియామకాలు చేపట్టకపోవడానికి కారణమని చెబుతున్నారు. సాధారణంగా ఆగస్టు-సెప్టెంబర్ మధ్యే క్యాంపస్ ప్లేస్‌మెంట్ సీజన్ ప్రారంభమవుతుంది. కానీ చాలా టైర్-1 కంపెనీలు నియామకాల కోసం ఇప్పటికీ కాలేజీలకు వెళ్లలేదు. సాధారణంగా నవంబర్-డిసెంబర్ మధ్య క్యాంపస్ సెలక్షన్స్ జరిపే ఇన్ఫోసిస్ కూడా… ఫిబ్రవరి పూర్తి కావొస్తున్నా… నియామకాలకు దూరంగా ఉంది. వచ్చే నెలలో అయినా ఇన్ఫోసిస్ క్యాంపస్ సెలక్షన్స్ జరుపుతుందేమోనని బడా కాలేజీలు ఎదురుచూస్తున్నాయి.
క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించకపోవడంపై విప్రో స్పందించింది. ఉద్యోగుల ప్రతిభే తమ ఆస్తి ఆని, అత్యుత్తమ ప్రతిభ ఉన్న వారిని నియమించుకోవడానికి కట్టుబడి ఉంటామని పేర్కొంది. ఇక ఇన్ఫోసిస్ కూడా… కొత్త నియామకాల అంశాన్ని నాలుగో క్వార్టర్ చివర్లో పరిశీలిస్తామని పేర్కొంది. ప్రస్తుతానికి డిమాండ్ మేరకు ఉద్యోగులు ఉన్నారని వెల్లడించింది. రెండు కంపెనీల స్పందన చూస్తుంటే… ఒకవేళ కొత్త నియామకాలు జరిపినా… చాలా తక్కువ మందికే అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
Ernie: చాట్‌జీపీటీకి బైదూ చెక్.. పోటీగా ఎర్నీ
New Electric Scooty:మార్కెట్లోకి మరో 2 కొత్త ఎలక్ట్రిక్ టూవీలర్లు