Big Stories

Yellow Shells :- గవ్వల ముడుపుతో గడప ముంగిట మహాలక్ష్మి

Yellow Shells :- ఐశ్వర్య ప్రాప్తి కోసం ఎన్నో రకాల పూజలు చేస్తుంటారు. శ్రీమహాలక్ష్మిని పూజిస్తూ ఆరాధిస్తుంటారు. ధన ప్రాప్తి కోసం చేసే పూజలలో లక్ష్మీగవ్వలకు విశేష స్థానం ఉంది. పసుపు రంగులో ఉండే గవ్వల్ని లక్ష్మీ గవ్వలని అంటారు. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామికి ఇష్టమైన రోజు శనివారం. ఆరోజు ఏడుకొండల వాడిని తలచుకుంటూ లక్ష్మీ గవ్వల ముడుపు కడితే పేదరికం పోతుందని నమ్మకం ఉంది. లక్ష్మీగవ్వల పూజ చేసేటప్పుడు కుబేర యంత్రంతోపాటు ఎర్రటి పువ్వుల్ని పూజ కోసం తీసుకోవాలి. యంత్రంపై స్వామి ఫోటోని పెట్టి పూజ చేయాలి. లక్ష్మీదేవి అష్టోతర శతనామావళి భక్తితో పఠించాలి. అలా చేసేటప్పుడు ఎర్రటి పూలతో కానీ అక్షంతలు కానీ ఉపయోగించ వచ్చు. గవ్వల్ని ఇంట్లో పెట్టి పూజ చేసేటప్పుడు నేరుగా నేలపై పెట్టకూడదు. వెండి పళ్లెంలో పెట్టి పూజను ఆచరించాలి…

- Advertisement -

- Advertisement -

లక్ష్మీగవ్వలను పూజించి వాటిని ఇంట్లోని బీరువాలో ఉంచాలి. అదే వ్యాపారస్థులు వారి దుకాణంలోని క్యాష్ బాక్స్ లో ఉంచుకోవాలి. లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చేటప్పుడు కూడా మంచి రోజు చూసుకోని తేవాలి. పౌర్ణమి రోజు గవ్వలు తీసుకొచ్చి ఆవు పాలతో కడిగి పసుపు, కుంకమ , గంధం రాసి దేవుడి దగ్గర పెట్టి పూజించాలి. పంచ గవ్వలను పూజ చేస్తే ధన ప్రవాహం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది.

బీరువా లోపల పెట్టేటప్పుడు తెల్లని వస్త్రంలో ఉంచి మూటలాగా కట్టి పెట్టాలి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒత్తులకి కర్పూరం రాసి వెలిగించాలి. ఈ పద్దతి పాటించి పూజ చేస్తే లక్ష్మీదేవి శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని నిలబడుతుంది. హారతి ఇచ్చేటప్పుడు చేతిలో పువ్వులను పెట్టుకుని చేయాలి. అలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలిగి ధన ప్రాప్తి జరుగుతుంది. ఇంటి యజమాని జన్మనక్షత్రం రోజున నివాసాన్ని ఆవు పంచకం సంప్రోక్షణ చేయాలి. పక్షులు, లేదా జంతువులు తాగేందుకు నీళ్లు నింపిన తొట్టేను ఇంటి ముందు ఉంచుకోవాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News