BigTV English

Tips For White Hair: తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే ?

Tips For White Hair: తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే ?

Tips For White Hair: నల్లని ఒత్తైన జుట్టు ప్రతి ఒక్కరి కల. కానీ జుట్టును నల్లగా మార్చే మెలనిన్ పిగ్మెంట్ పరిమాణంలో మార్పు కారణంగా చిన్న వయస్సులోనే చాలా మంది జుట్టు  తెల్లగా మారుతుంది. చిన్న వయస్సులోనే జుట్టు రంగు మారడం వృద్ధాప్యానికి సంకేతం కాదు. కానీ ఇలాంటి సమయంలోనే ఆత్మ విశ్వాసం తగ్గుతుంది. అందుకే మీ జుట్టును సహజంగా నల్లగా మార్చుకోవడానికి హెయిర్ కేర్ టిప్స్ ఫాలో అవ్వడం మంచిది. మరి ఎలాంటి టిప్స్ తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


పెరుగుతున్న వయస్సు, కాలుష్యం, UV కిరణాలు, జన్యుశాస్త్రం లేదా ఒత్తిడి కారణంగా కూడా తెల్ల జుట్టు సమస్య కూడా వస్తుంది. మన శరీరం మెలనిన్ అనే వర్ణద్రవ్యాన్ని తయారు చేస్తుంది. మెలనిన్‌లో యూమెలనిన్, ఫియోమెలనిన్ అనే రెండు రకాలు ఉన్నాయి. సాధారణంగా యూమెలనిన్ కారణంగా జుట్టు యొక్క రంగు నల్లగా ఉంటుంది. ఇవి వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేయడంతోపాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా బలహీనపరుస్తాయి. అటువంటి పరిస్థితిలో జుట్టును జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని ముఖ్యమైన చిట్కాలు మీ జుట్టును సహజంగా నల్లగా ఉంచుతాయి.

ఇలా జుట్టు నల్లగా, ఒత్తుగా మార్చుకోండి:


ఉసిరి, గోరింట, మెంతికూరతో హెయిర్ ప్యాక్ తయారు చేసి, మీ జుట్టును వాస్ చేయడానికి 20 నిమిషాల ముందు అప్లై చేయండి. ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు నల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. హెన్నాను సహజ రంగు అని కూడా అంటారు.

కొబ్బరి, జోజోబా, ఆలివ్ నూనెతో స్కాల్ప్ మసాజ్‌ చేసుకోండి . ఇవి స్కాల్ప్ యొక్క రక్త ప్రసరణను పెంచుతాయి. అంతే కాకుండా మూలాలకు పోషణను అందిస్తాయి, జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి. చిన్న వయస్సులోనే వచ్చే తెల్ల జుట్టు సమస్యను కూడా తగ్గిస్తాయి.

కెమికల్స్ ఎక్కువగా ఉన్న షాంపూ కండిషనర్లను ఉపయోగించకండి. ఇవి మీ జుట్టుకు హాని కలిగించడమే కాకుండా, జుట్టు యొక్క సహజ రంగును కూడా మార్చుతాయి.

అమ్మోనియా ఉన్న షాంపూలు జుట్టును మరింత తెల్లగా చేస్తాయి.

కాఫీ హెయిర్ మాస్క్ వేయండి. ఇది జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. అంతే కాకుండా కెరాటినోసైట్స్ ఏర్పడటానికి సహాయపడుతుంది. దీంతో జుట్టు సహజంగా నల్లగా మారుతుంది.

జుట్టు పెరుగుదలతో పాటు జుట్టు నల్లగా మర్చేందుకు వాడే ఆహారాన్ని తినండి. ఉసిరి, గుడ్లు, ఆకుకూరలు , నువ్వుల నూనె, కొబ్బరి నూనె, కరివేపాకు వంటివి తినడం మంచిది. పప్పులు, బాదం పప్పులు, వేరుశనగలు మొదలైన రాగి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల మెలనిన్ పిగ్మెంట్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. విటమిన్లు పుష్కలంగా తీసుకోవాలి. విటమిన్ ఎ స్కాల్ప్ కేర్ అందించే సెబమ్‌ను ఉత్పత్తి చేస్తుంది.

విటమిన్ బిలోని బయోటిన్ జుట్టుకు ఉపయోగపడుతుంది. ఇవి ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఇవి జుట్టుకు ఆక్సిజన్ , అవసరమైన పోషణను అందిస్తాయి.

Also Read: వేడి నీళ్లతో తలస్నానం చేస్తున్నారా ? జాగ్రత్త

విటమిన్ ఇ , విటమిన్ సి:
జుట్టుకు పర్ఫెక్ట్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడతాయి. అంతే కాకుండా ఆరోగ్యకరమైన నల్లటి జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. విటమిన్ లోపం ఉన్నట్లయితే వారి సప్లిమెంట్లను తీసుకోండి.

Related News

Hyderabad: ఘనంగా రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 కార్యక్రమం!

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×