Tips For Hair : చలికాలంలో అనేక చర్మ సంబంధిత సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో జుట్టు నిర్జీవంగా, పొడిగా మారుతుంది. ఇలాంటి సమయంలోనే మనం కొన్ని రకాల టిప్స్ పాటించడం చాలా ముఖ్యం. స్కిన్ పొడిబారినట్లు అనిపిస్తే మాత్రం తప్పకుండా హోం రెమెడీస్ వాడాలి. వీటిని వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే మంచి ఫలిత ఉంటుంది. మారుతున్న సీజన్‌లను ఎదుర్కోవడానికి మన జుట్టుకు కూడా అదనపు జాగ్రత్త అవసరం. ముఖ్యంగా చలికాలంలో జుట్టు రాలకుండా ఉండాలంటే ఎలాంటి హోం రెమెడీస్ వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. మాయిశ్చరైజ్ :
వేసవి కాలం కంటే చలికాలంలో మన జుట్టు పొడిబారుతుంది. అందుకే జుట్టుకు తేమను అందించడానికి తప్పకుండా హెయిర్ ఆయిల్ అప్లై చేయండి. ఇలా చేయడం ద్వారా జుట్టు అవసరమైన పోషణ లభిస్తుంది. ఫలితంగా జుట్టు రాలకుండా ఉంటుంది. తరుచుగా జుట్టుకు ఆయిల్ అప్లై చేయడం వల్ల హెయిర్ బాగా పెరుగుతుంది.
2. డీప్ కండిషనింగ్:
ప్రతి రెండు రోజులు లేదా ప్రతి మూడు రోజులకు మీ జుట్టును డీప్ కండిషనింగ్ చేయండి . అంతే కాకుండా చాలా వేడి నీటితో తలస్నానం చేయడం మానేయండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా జుట్టు రాలకుండా ఉండాలంటే కొన్ని హోం రెమెడీస్ కూడా వారానికి కనీసం ఒక్కసారైనా వాడాలి.
3. టోపీ వాడండి:
మీ జుట్టును టోపీ లేదా అందమైన హెడ్ ర్యాప్‌తో కవర్ చేసుకోండి. ముఖ్యంగా చాలా చల్లని వాతావరణంలో. ఇలా చేయడం వల్ల పొడి గాలి కూడా మీ జుట్టుకు చేరదు. మీ జుట్టు కూడా పొడిగా మారదు. కాలుష్యం కారణంగా కూడా చాలా వరకు జుట్టు డ్యామేజ్ అవుతుంది. అంతే కాకుండా చుండ్రు సమస్యలు కూడా పెరుగుతాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే బయటకు వెళ్ళే సమయంలో క్యాప్ ధరించడం తప్పనిసరి.
4. వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి
జుట్టుకు లోపల నుండి పోషణ తేమ చాలా ముఖ్యం. మీ జుట్టు లోపలి నుండి తేమగా ఉండటానికి అవసరమైనంత ఎక్కువ నీరు త్రాగండి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా చేయడం చాలా కష్టం, కానీ తగినంత నీరు తాగడం వల్ల మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
Also Read: మొటిమలు, మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా ?
5. ఆవిరి తీసుకోవడం ఎల్లప్పుడూ ఉపయోగకరంగా ఉంటుంది:
స్టీమింగ్ హెయిర్ క్యూటికల్‌ను తెరుస్తుంది . అంతే కాకుండా జుట్టు అవసరమైన తేమను కూడా అందిస్తుంది. ఇలా తరుచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది జుట్టు డ్యామేజ్ ను తగ్గించి జుట్టు రాకుండా చేస్తుంది. జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఈ టిప్స్ పాటించడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.