Public Holidays 2025: నూతన సంవత్సరం రాబోతుంది. అదేనండి 2025 ఏడాదికి ఇక కొద్దిరోజులే మిగిలి ఉన్నాయి. అంతటా సంబరాలకు ఏర్పాట్లు సాగుతున్నాయి. అయితే 2025 ఏడాదిలో అధికారిక, ఆప్షనల్ సెలవులపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ కార్యాలయాల అధికారులు, ఈ సెలవులను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది.
జనవరి నెలలో 1న కొత్త ఏడాది, 13న భోగి, 14 సంక్రాంతి, 26న రిపబ్లిక్ డే, ఫిబ్రవరి 26న మహా శివరాత్రి, మార్చి నెలలో 14న హోలీ, 30 ఉగాది, 31 రంజాన్, ఏప్రిల్ నెలలో 1న కూడా రంజాన్ సెలవు, 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి, 6న శ్రీరామ నవమి, 14న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి, 18న గుడ్ ఫ్రైడే, జూన్ నెలలో 7న బక్రీద్, జులై 6న మొహర్రం, 21న బోనాల పండుగ సెలవు రోజులుగా ప్రకటించారు.
ఆగస్ట్ నెలలో 15న స్వాతంత్ర్య దినోత్సవం , 16న శ్రీ కృష్ణాష్టమి, 27న వినాయక చవితి, సెప్టెంబర్ నెలలో 5న మిలాద్ ఉన్ నబీ, 21న బతుకమ్మ పండుగ ప్రారంభ రోజు, అక్టోబర్ నెలలో 2న మహాత్మా గాంధీ జయంతి, 3న విజయదశమి, 20న దీపావళి, నవంబర్ నెల 5న కార్తీక పౌర్ణమి, డిసెంబర్ 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే (క్రిస్మస్ సెలవుకు కొనసాగింపు) సాధారణ సెలవు దినాలుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: Tirumala Update: తిరుమలలో మీకు సమస్యా.. ఒక్క కాల్ చేయండి
ఇక ఆప్షనల్ సెలవుల విషయానికి వస్తే.. జనవరి నెలలో 14, 15, 28 తేదీలు, ఫిబ్రవరి నెలలో 3, 14, మార్చి నెలలో 21, 28 ఏప్రిల్ నెలలో 10, 14, 30 మే నెలలో 12వ తేదీ, జూన్ నెలలో 15, 27 జూలై నెలలో 5వ తేదీ, ఆగస్ట్ నెలలో 8, 9 సెప్టెంబర్ నెలలో 30వ తేదీ, అక్టోబర్ నెలలో 1, 4, 19 నవంబర్ నెలలో 16వ తేదీ, డిసెంబర్ నెలలో 24వ తేదీలు పరిగణించబడ్డాయి. 2025 ఏడాదిలో మొత్తం సాధారణ సెలవుల సంఖ్య 27 రోజులు కాగా, ఆప్షన్ హాలిడేస్ సంఖ్య 23 రోజులుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.