BigTV English

Virat Kohli: బాక్సింగ్‌ టెస్టులో కలకలం..విరాట్ వైపు దూసుకొచ్చిన ప్రేక్షకుడు..!

Virat Kohli: బాక్సింగ్‌ టెస్టులో కలకలం..విరాట్ వైపు దూసుకొచ్చిన ప్రేక్షకుడు..!

Virat Kohli: అభిమానులు కొన్నిసార్లు సెక్యూరిటీ కళ్ళు కప్పి మైదానంలోకి దూసుకు రావడం అప్పుడప్పుడు మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటి సంఘటనే తాజాగా మరొకటి చోటు చేసుకుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 లో భాగంగా మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న 4 వ బాక్సింగ్ డే టెస్ట్ రెండో రోజు ఆటలో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. ఓ అభిమాని అత్యుత్సాహం చూపించాడు. స్టేడియంలో ఓ అభిమాని భారీకేడ్లు దాటి మరి ఫీల్డింగ్ చేస్తున్న టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ వైపు దూసుకొచ్చాడు.


Also Read: Mohammed Siraj: సిరాజ్ ఉండి దండగే.. 23 ఓవర్లు.. ఒక్క వికెట్ తీయలేదు ?

కోహ్లీని ఆలింగనం చేసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆటకు కాసేపు అంతరాయం కలిగింది. విరాట్ కోహ్లీ భుజాలపై చేతులేసి ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఆ తరువాత మైదానంలో డాన్స్ కూడా వేశాడు. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది మైదానంలోకి వచ్చి సదరు వ్యక్తిని బయటకు తీసుకువెళ్లారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రెండవ రోజు ఆట ప్రారంభమైన గంటలోపే ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రేక్షకుడు స్టేడియంలోకి దూసుకువచ్చిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 97 ఓవర్ మధ్యలో ఆక్రమణదారుడు భారీకేడ్లు దాటి మైదానంలోకి ప్రవేశించాడు. మొదట భారత కెప్టెన్ రోహిత్ శర్మ వైపు వెళ్ళాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకోగలిగింది. దీంతో అక్కడే ఉన్న విరాట్ కోహ్లీ దగ్గరకు వెళ్లి ఆ లింగనం చేసుకునే ప్రయత్నం చేశాడు. కానీ కోహ్లీ ప్రతిఘటించడంతో భుజంపై చేయి వేసి ఫోజ్ ఇచ్చాడు. ఎట్టకేలకు అతడిని పట్టుకున్న భద్రతా సిబ్బంది అతడిని మైదానం నుండి బయటకు తీసుకువెళ్లారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా మైదానంలోకి వచ్చిన అతనిపై క్రికెట్ ఆస్ట్రేలియా (సిఏ) చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఇక తొలి రోజు విరాట్ కోహ్లీ – ఆస్ట్రేలియా బ్యాటర్ కాన్ స్టాస్ మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మేల్ బోర్న్ మైదానంలో ప్రేక్షకులు కోహ్లీ పేరును పెద్ద ఎత్తున హోరెత్తించారు. నాలుగవ టెస్ట్ మొదటి రోజు రికార్డు స్థాయిలో ప్రేక్షకులు హాజరయ్యారు. తొలిరోజు పోరును ప్రత్యక్షంగా చూసేందుకు 87, 242 మంది స్టేడియానికి తరలివచ్చారు. వీరిని ప్రోత్సహిస్తున్నట్లుగా కోహ్లీ సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Also Read: Indian players: బాక్సింగ్ డే టెస్ట్ లో నల్ల బ్యాండ్లతో భారత క్రికెటర్లు

ఇక ఈ తొలి ఇన్నింగ్స్ లో ఆసిస్ 474 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ఆసీస్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ 140, లబుషేన్ 72, ఉస్మాన్ ఖవాజా 72, కాన్ స్టాస్ 60, కమీన్స్ 49 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో బూమ్రా 4, జడేజా 3, ఆకాష్ దీప్ 2, సుందర్ ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ కి దిగిన భారత జట్టు రెండు వికెట్లను కోల్పోయింది. రోహిత్ శర్మ 3, కేఎల్ రాహుల్ 24 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యారు. ప్రస్తుతం యశస్వి జైస్వాల్ 72, విరాట్ కోహ్లీ 35 పరుగులతో నిలకడగా రాణిస్తున్నారు.

 

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×