White Skin : చలికాలంలో ప్రత్యేక చర్మ సంరక్షణ అవసరం అవుతుంది. చాలా మంది తమ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఖరీదైన బ్యూటీ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయితే ఇంట్లోనే సులువుగా లభించే కొన్ని సహజసిద్ధమైన పదార్థాల సహాయంతో చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. ఇవి చర్మాన్ని మాయిశ్చరైజింగ్ చేయడంతో పాటు మృదువుగా ఉంచడంలో సహాయపడతాయి.
చలికాలంలో చర్మానికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మం చాలా డల్ గా మారుతుంది. దీన్ని నివారించడానికి, కొన్ని సహజ నివారణలు మీకు చాలా సహాయపడతాయి. మిమ్మల్ని అందంగా ఉంచడంలో సహాయపడే 5 స్కిన్ కేర్ టిప్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
1. పెరుగు, పసుపు ఫేస్ ప్యాక్:
ప్రయోజనాలు: పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా,మెరిసేలా చేస్తుంది. పసుపులో క్రిమినాశక గుణాలు ఉన్నాయి. ఇవి మొటిమలు, మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి.
తయారుచేసే విధానం: 2 టీస్పూన్ల పెరుగులో అర టీస్పూన్ పసుపు వేసి పేస్ట్ లా చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తర్వాత వాష్ చేయండి.
2. ఓట్స్, హనీ ఫేస్ ప్యాక్:
ప్రయోజనాలు: ఓట్స్ వాపును తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. తేనె చర్మానికి తేమను అందించి మృదువుగా చేస్తుంది.
తయారుచేసే విధానం: 2 చెంచాల ఓట్స్‌ను గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి. దానికి 1 టీస్పూన్ తేనె కలిపి పేస్ట్‌లా చేయండి. దీన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి.
3. దోసకాయ ఫేస్ ప్యాక్:
ప్రయోజనాలు: దోసకాయ చర్మాన్ని చల్లబరుస్తుంది. అంతే కాకుండా చర్మంపై మంటను తగ్గిస్తుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.
తయారుచేసే విధానం: దోసకాయను తొక్క తీసి రుబ్బుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి.
4. అలోవెరా జెల్:
ప్రయోజనాలు: అలోవెరా జెల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని ఉపశమనం చేస్తాయి. అంతే కాకుండా చికాకును తగ్గిస్తాయి.
తయారుచేసే విధానం: కలబంద ఆకు నుండి జెల్‌ని తీసి ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి.
5. రోజ్ వాటర్:
ప్రయోజనాలు: రోజ్ వాటర్ చర్మాన్ని టోన్ చేస్తుంది. అంతే కాకుండా పోషణ చేస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా , మెరిసేలా చేస్తుంది.
తయారుచేసే విధానం: రోజూ రోజ్ వాటర్‌తో ముఖాన్ని కడుక్కోవాలి లేదా రోజ్ వాటర్‌లో దూదిని ముంచి ముఖానికి అప్లై చేయాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
Also Read: వీటితో.. హెయిర్ లాస్‌కు చెక్
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ఏదైనా కొత్త రెమెడీని ప్రయత్నించే ముందు, ప్యాచ్ టెస్ట్ చేయండి.
మీకు ఏదైనా అలెర్జీ ఉంటే వీటిని ఉపయోగించవద్దు.
ఈ రెమెడీలను క్రమం తప్పకుండా ఉపయోగించడం ద్వారా మీరు మంచి ఫలితాలను పొందుతారు.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.