Big Stories

Diabetes Fasintg: ఉపవాసం వల్ల షుగర్ లెవల్స్ ఎందుకు పెరుగుతాయి..?

Does Fasting Effects Sugar Levels in Diabetic Patients: డయాబెటిస్ ప్రపంచ జనాభాను బయపెడుతున్న వ్యాధి. ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేేకుండా పుట్టిన బిడ్డల నుంచి ప్రతి ఒక్కరు మధుమేహం బారిన పడుతున్నారు. ఒక్కసారి ఇది వచ్చిందంటే ఇక నయం కాదు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఎవరినైనా ఈ వ్యాధి బాధితులుగా చేస్తుంది. దీని కారణంగా మీరు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో షుగర్‌ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే కొందరు ప్రత్యేక సందర్భాల్లో ఫాస్టింగ్ ఉంటారు. డయాబెటిస్‌లో ఫాస్టింగ్ షుగర్‌ని ఎక్కువగా ఉంటుంది. దీనికి గల కారణాలు ఏమిటో తెలుసుకోండి.

- Advertisement -

షుగర్ లేదా డయాబెటీస్ అనేది శరీరంలో సంభవించే ఒక వ్యాధి. ఇది ఒకసారి వచ్చినప్పుడు నియంత్రించడం తప్పా మరేమి చేయలేము. ఇన్సులిన్ అనే హార్మోన్ అసమతుల్యత వల్ల ఈ వ్యాధి సంభవిస్తుంది. ఇన్సులిన్ అనేది మన శరీర పోషణ కోసం ఆహారం నుండి కణాలలోకి గ్లూకోజ్‌ని అందించడానికి పనిచేసే హార్మోన్.

- Advertisement -

డయాబెటిక్ విషయంలో ఈ ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది లేదా సరిగ్గా ఉపయోగించబడదు. దాని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి అదుపు లేకుండా పోతుంది. అప్పుడు మనకు రెండు రకాల మధుమేహం సమస్యలు వస్తాయి.

Also Read: సమ్మర్.. ఈ చిట్కాలతో మీ జుట్టు సేఫ్!

టైప్ 1 డయాబెటిస్‌ : ఇన్సులిన్ పూర్తిగా లేకపోవడం లేదా శరీరానికి ప్రతిరోజూ అవసరమైన ఇన్సులిన్ అందకపోవడం దీనికి కారణం కావచ్చు.

టైప్ 2 డయాబెటిస్ :  మన శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించదు. ఈ మధుమేహం సాధారణంగా యుక్తవయస్సులో సంభవిస్తుంది. ఎందుకంటే ఈ వయస్సులో శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం ప్రారంభమవుతుంది.

ఫాస్టింగ్ వల్ల షుగర్ ఎందుకు ఎక్కువ అవుతుంది?
రోజువారీ ఆహారానికి ఎక్కువ కాలం దూరంగా ఉంచడం వల్ల ఫాస్టింగ్ షుగర్ లెవల్‌ను పెంచుతుంది. అంతే కాకుండా రాత్రిపూట ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువసేపు ఆకలితో ఉండడం వల్ల ఫాస్టింగ్‌లో షుగర్ కూడా ఎక్కువ అవుతుంది.

Also Read: బీ కేర్ ఫుల్.. ఈ పురుగు మీ గుండెను తీనేస్తుంది!

ఉపవాసంలో షుగర్‌ని నివారించడానికి మార్గాలు

  • రాత్రిపూట ఎల్లప్పుడూ తేలికపాటి ఆహారాన్ని తినండి.
  •  ఎక్కువ స్వీట్లు తినకుండా ఉండండి.
  • రోజువారీ వ్యాయామం మధుమేహాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది.
  • కాబట్టి రోజువారీ వ్యాయామం చేయండి.
  • రాత్రి భోజనం చేసిన తర్వాత అరగంట పదిహేను నిమిషాలు నడవండి.
  • రాత్రి నిద్రపోయే ముందు ధ్యానం లేద యోగా చేయండి.
  • ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. చక్కెర స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది.
  • రోజంతా ఎనిమిది నుండి పది గ్లాసుల నీరు త్రాగాలి.
  • పడుకునే ముందు తప్పకుండా నీరు త్రాగాలి.
  • తప్పనిసరిగా ఉదయం, రాత్రి బ్రష్ చేయండి.
- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News