BigTV English

Warts : పులిపిర్లు ఎందుకు వస్తాయి? .. వాటిని మాయం చేయడం ఎలా?

Warts : పులిపిర్లు ఎందుకు వస్తాయి? .. వాటిని మాయం చేయడం ఎలా?

wats treatment


Warts Treatment: సాధారణంగా చాలా మందికి మెడ, ముఖం, శరీరంలో కొన్ని భాగాలలో పులిపిర్లు వస్తుంటాయి. పులిపిర్లు కొందరికి ఒకటి లేదా రెండు వస్తే.. మరి కొందరికైతే ముఖం, మెడ భాగంలో నిండా వస్తాయి. పిలిపిర్లు మన అందాన్ని చెడగొడతాయి. వీటిని తగ్గించుకోవడానికి చాలామంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.

శరీరంలో ఎక్కువగా చెమట ఉత్పత్తి అయినప్పుడు శుభ్రత లేకపోవడం వల్ల ఆ ప్రాంతంలో ఓ వైరస్ ఉత్పత్తి అవుతుంది. దీన్ని హ్యూమన్ పాపిలోమా అని అంటారు. ఆ వైరస్ చర్మంపై క్రమంగా పెరుగుతూ పులిపిరిగా మారుతుంది. అందుకే రోజుకు రెండు సార్లు స్నానం చేయడం చాలా ముఖ్యం.


Read More : ఫిష్ పెడిక్యూర్.. యమ డేంజర్ గురూ..!

అయితే పులిపిర్లను సరైన పద్ధతిలో తొలగించకపోతే..మళ్లీ మళ్లీ వస్తుంటాయి. పులిపిర్లు ఇక ఎప్పటికీ రాకుండా శ్వతంగా పోయే విధంగా మంచి రెమెడీస్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. పుసుపుతో పులిపిర్లు తగ్గించే పద్ధతి

  • ఒక చిన్న బౌల్‌లో కొంచెం పసుపు వేయాలి
  • కుదిరితే మంచి పసుపును తీసుకోండి
  • ఆయుర్వేదిక్ షాపులో దొరికే పసుపు తీసుకోండి
  • అందులో కొంచెం వంట సోడా వేయాలి
  • వంట సోడాను పులిపిర్లు దగ్గర అప్లై చేస్తే అవి మెత్తబడతాయి
  • అలానే వంట సోడా పులిపిర్లను శుభ్రం చేస్తుంది
  • వంట సోడాలో కాస్త సున్నం వేయండి
  • ఇందులో కొంచెం నిమ్మరసాన్ని పిండాలి
  • అందులో కాస్త కాఫీ పౌడర్ కలపండి
  • ఒక 45 నిమిషాలు తర్వాత ఈ మిశ్రమాన్ని పులిపిర్లపై అప్లై చేయండి

2. అవిసె గింజలతో పులిపిర్లు తగ్గించే పద్ధతి

  • కొన్ని అవిసె గింజలను తీసుకొని వాటిని పేస్ట్ లా చేయండి
  • తర్వాత దానికి కాసింత తేనె కలిపి పులిపిర్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ మిశ్రమాన్ని అప్లై చేయాలి
  • తర్వాత దాని చుట్టు చిన్న బ్యాండేజ్ వేయాలి
  • ఆ బ్యాండేజ్‌ను కొన్ని రోజుల పాటు అలానే ఉంచాలి
  • కొన్ని రోజుల తర్వాత బ్యాండేజ్‌ను తీస్తే ..పులిపిరి రాలిపోతుంది

3. వెల్లుల్లితో పులిపిర్లు తగ్గించే పద్ధతి

  • వెల్లుల్లిని పేస్ట్ గా చేసి పులిపిర్ల మీద రాయాలి
  • తర్వాత దాని మీద బ్యాండేజ్ వేయాలి
  • ఇలా తరచూ చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే పులిపిర్లు రాలిపోతాయి

4. ఉల్లిపాయతో పులిపిర్లు తగ్గించే పద్ధతి

  • ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేయండి
  • ఆ తర్వాత వెనిగర్‌లో వేసి రాత్రంతా ఉంచండి
  • ఉదయం ఆ వెనిగర్ ను పులిపిర్ల పై రుద్దాలి
  • దీంతో పులిపిర్లు మాయం అవుతాయి

Disclaimer : ఈ సమచారాన్నిహెల్త్ జర్నల్స్ ఆధారంగా మీ అవగాహన కోసం అందిస్తున్నాం.

Tags

Related News

Diet tips: రాగి ముద్ద తినడం వల్ల కలిగే ఆరోగ్య రహస్యాలు.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు

Shocking Facts: రాత్రి 7 తర్వాత భోజనం చేస్తారా? మీ ఆరోగ్యానికి షాక్ ఇచ్చే నిజాలు!

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Dondakaya Fry: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Health tips: గుండెల మీద ఎవరైనా కూర్చొన్నట్లు అనిపిస్తోందా? దానిని ఏమంటారో తెలుసా?

Navratri Fasting: నవరాత్రి ఉపవాస సమయంలో.. ఈ ఫుడ్ తింటే ఫుల్ ఎనర్జీ !

Big Stories

×