Big Stories

Fish Pedicure : ఫిష్ పెడిక్యూర్.. యమ డేంజర్ గురూ..!

Fish Pedicure

- Advertisement -

Fish Pedicure Side Effects : శరీర అందాన్ని పెంచుకోవడానికి బ్యూటీ ఇండస్ట్రీలో అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పెడిక్యూర్ కూడా ఒకటి. ముఖ్యంగా మహిళలు తమ పాదాలు, కాళ్లను అందంగా ఉంచుకోడానికి పెడిక్యూర్‌లు చేయించుకుంటారు. ఫిష్ పెడిక్యూర్ ప్రస్తుత కాలంలో చాలా ప్రాచుర్యం పొందింది. ఇవి పబ్లిక్ ప్లేసుల్లోనూ, స్పా లేదా సెలూన్‌లోనూ అందుబాటులో ఉంటున్నాయి.

- Advertisement -

పిష్ పెడిక్యూర్ చికిత్సలో పాదాలపై ఉన్న డెడ్ స్కిన్‌ని చేపలు తింటాయి. దీనివల్ల పాదాలు మృదువుగా అవుతాయి. దీంతో పాదాల అందం పెరుగుతుంది. అలానే పాదాలపై ఉన్న మురికి కూడా తొలగిపోతుంది. ఈ చికిత్స సరైనది కాదని ఇప్పటికే చాలా దేశాల్లో నిషేధించారు. కానీ భారతదేశంలో మాత్రం ఏ షాపింగ్‌మాల్‌కు వెళ్లినా ఈ పెడిక్యూర్ చికిత్సలు కనిపిస్తుంటాయి.

Read More : ఫుడ్ అలర్జీతో బాధపడుతున్నారా? ..ఈ చికిత్సలతో చెక్ పెట్టండి..!

ఫిష్ పెడిక్యూర్ చికిత్స

ఫిష్ పెడిక్యూర్ చికిత్స కోసం ముందుగా పాదాలపై ఉండే డెడ్ స్కిన్‌ని తొలిగించాలి. దీనికోసం స్క్రబ్స్, బ్లీచ్‌లు వంటి వాటితో శుభ్రం చేస్తారు. ఆ తర్వాత వేడి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. అనంతరం పాదాలను చిన్న చేపలు ఉన్న బేసిన్‌లో ఉంచాలి. ఆ బేసిన్‌లో ఉండే చేపలు పాదాలు, అరికాళ్లు, కాలి వేళ్లపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్‌ను తినేస్తాయి.

ఈ ప్రక్రియ కోసం 15 నిమిషాల పాటు కాళ్లు చేపల బేసిన్‌లో ఉంచాలి. ప్రస్తుత కాలంలో పాదాల చికిత్స కోసం అమ్మాయిలు ఫిష్ పెడిక్యూర్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నారు. పాదాలకు చేసే చికిత్స ఖరీదు కాస్త తక్కువగా ఉండడంతో ఫిష్ పెడిక్యూర్‌కు క్రేజ్ విపరీతంగా పెరిగింది. చాలా మంది మహిళలు ఈ చికిత్స చేయించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

అనారోగ్య సమస్యలు

ఫిష్ పెడిక్యూర్ చేయించుకోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొన్ని సందర్భాల్లో చేపలు మంచి చర్మాన్ని కూడా తినే ప్రమాదం ఉంది. చేపలు పాదాలపై గాయాలు కూడా చేస్తాయి. దీని కారణంగా రక్తస్రావం జరుగుతుంది. ఫిష్ పెడిక్యూర్ వల్ల జూనోటిక్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అంతేకాకుండా డయాబెటిస్ ఉన్న వారిలో ఈ  సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన పలు దేశాలు సైతం ఫిష్ పెడిక్యూర్‌ను నిషేధించాయి. ఈ చికిత్స మొదట టర్కీలో ప్రజాదరణ పొందింది.

Read More : మళ్లీ తిరిగొచ్చిన బుబోనిక్ వ్యాధి.. ఈ జంతువులకు దూరంగా ఉండండి!

ఫిష్ పెడిక్యూర్ కోసం ఉపయోగించే గుర్రా రుఫా అనే చేపలను వినియోగిస్తారు. ఈ చేపల చనిపోయిన చేపలను తింటుంది. ఈ గుర్రా రుఫాల చేపలకు ఆహారం ఇవ్వకపోతే ఆకలితో అవి బేసిన్‌లో పెట్టిన మనిషి పాదాల చర్మాన్ని తింటాయి. దీనివల్ల ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లు సోకుతాయి.

Disclaimer : ఈ సమచారాన్ని ఆరోగ్య నిపుణుల సూచనలు, హెల్త్ జర్నల్స్ ఆధారంగా మీ అవగాహన కోసం అందిస్తున్నాం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News