BigTV English

Cucumber Benefits: కీరదోస తింటే ఎటువంటి ప్రమాదకర సమస్యలు అయినా పరార్..

Cucumber Benefits: కీరదోస తింటే ఎటువంటి ప్రమాదకర సమస్యలు అయినా పరార్..

Cucumber Benefits: ఆహారంలో ఎక్కువగా కూరగయాలు, ఆకుకూరలు, పండ్లు వంటివి తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అందులో ఉండే పోషకాల కారణంగా దీర్ఘకాలిక సమస్యలు, ప్రాణాంతకర వ్యాధులను కూడా తప్పించుకోవచ్చు. ముఖ్యంగా శరీరానికి ఎంతో చలువ చేసే కీర దోసను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కీరదోసలో పొటాషియం, విటమిన్ బి, సి, కె వంటి మెండుగా ఉంటాయి. అందువల్ల వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు ఫిట్ నెస్ కూడా మెయింటెన్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.


ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా ఎన్నో రకాల అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది. అయితే తరచూ తీసుకునే ఆహారంలో కీరదోసను ఏదో ఒక విధంగా తీసుకోవడం వల్ల మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. సలాడ్, జ్యూస్ వంటి వాటి రూపంలో కీరదోసను తీసుకోవడం వల్ల పుష్కలమైన పోషకాలు శరీరానికి అందుతాయి. అంతేకాదు ఇందులో ఉండే విటమిన్ సి, బి, కె వంటివి శరీరానికి అంది శరీరం ఆరోగ్యంతో పాటు శరీర ఆకృతిని కాపాడుకోవడం, కొలస్ట్రాల్ వంటివి తగ్గించుకుని ఆరోగ్యంగా ఉండవచ్చు. మెదడు ఆరోగ్యానికి కీరదోస ఎంతో ఉపయోగపడుతుంది.

జ్ఞాపక శక్తి :


కీరదోసను తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా రక్షించుకోవచ్చు. అంతేకాదు దోసకాయను తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. అంతేకాదు మతిమరుపు వంటి సమస్యలు ఉన్న వారు కీరదోసను తీసుకోవడం వల్ల మెదడుకు పదును పెట్టవచ్చు.

శరీరం నుండి టాక్సిన్స్ తొలగిపోతాయి :

కీరదోసను తీసుకోవడం వల్ల శరీరంలోని అనేక రకాల టాక్సిన్స్ వంటివి తొలగించుకోవచ్చు. విషపూరితమైన అంశాలను కూడా శరీరం నుంచి తొలగించుకోవచ్చు. అంతేకాదు కీరదోసలో 95 శాతం నీరు ఉండడం వల్ల ఇది ఎంతో మేలు చేస్తుంది.

జీర్ణక్రియ :

జీర్ణక్రియ వంటి సమస్యలు ఉన్నవారు కీరదోసను తీసుకోవడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలను నివారించవచ్చు.

క్యాన్సర్ ప్రమాదం :

ప్రాణాంతకర వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి కూడా కీరదోస అద్భుతంగా పనిచేస్తుంది. ఇది అండాశయాలు, క్యాన్సర్, రొమ్ము వంటి అనేక ప్రాణాంతకర వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

శరీరానికి చల్లదనం :

కీరదోసను తీసుకోవడం వల్ల స్కిన్ బర్న్, అలర్జీలు, సన్ బర్న్ వంటి వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు.

(గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.)

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×