Turmeric Water: స్నానం చేయడం మన శరీరానికి ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రమం తప్పకుండా స్నానం చేయడం వల్ల శరీరంపై మురికిని తొలగిపోవడమే కాకుండా మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది. అయితే, స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను కొన్ని రకాల టిప్స్ పాటించడం వల్ల మరింత పెంచుకోవచ్చు. దీని కోసం స్నానం చేసే నీటిలో పసుపు కలపాల్సి ఉంటుంది.
ఆయుర్వేద లక్షణాలకు ప్రసిద్ధి చెందిన పసుపును మీరు స్నానం చేసే నీటిలో కలుపుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. పసుపు నీటితో స్నానం చేస్తే.. కలిగే ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మానికి మెరుపును తెస్తాయి:
స్నానం చేసే నీటిలో ఒక చెంచా పసుపు కలిపితే, అది మీ చర్మాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. పసుపు నీటితో స్నానం చేయడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అంతే కాకుండా చర్మానికి సహజమైన మెరుపు కూడా వస్తుంది. పసుపు, యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల చర్మాన్ని బిగుతుగా మార్చడంలో కూడా సహాయపడుతుంది.
చర్మ సమస్యలు దూరమవుతాయి:
పసుపులో యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఇది అనేక చర్మ సంబంధిత సమస్యలను తొలగించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.మీకు దురద లేదా దద్దుర్లు సమస్య ఉంటే పసుపు నీటితో స్నానం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తొలగించడంలో పసుపు నీరు చాలా సహాయపడుతుంది.
మొటిమలను తగ్గిస్తుంది:
హార్మోన్ల అసమతుల్యత కారణంగా, ముఖంపై మొటిమలు సమస్య చాలా సాధారణం. కొన్ని సార్లు వివిధ రకాల స్కిన్ కేర్ ఉత్పత్తులను ఉపయోగించిన తర్వాత కూడా మొటిమలు తగ్గవు. అలాంటి సమయంలో పసుపు నీటితో ఫేస్ వాష్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పసుపులోని హీలింగ్ గుణాలు మొటిమలను తొలగించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
మచ్చలను తొలగిస్తుంది:
శరీరంపై మచ్చలు ఉంటే వాటిని పోగొట్టుకోవడానికి పసుపు నీటితో స్నానం చేయడం వల్ల చాలా మేలు జరుగుతుంది. పసుపులో అనేక అంశాలు ఉన్నాయి. ఇవి చర్మపు మచ్చలు పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. రంగు మారిన చర్మాన్ని తిరిగి కాంతివంతంగా మార్చడానికి కూడా పసుపు నీరు చాలా బాగా ఉపయోగపడుతుంది.
గాయాలను నయం చేయడంలో సహాయపడతాయి:
పసుపు నీరు గాయాలను నయం చేయడంలో కూడా చాలా సహాయపడుతుంది. పసుపులో యాంటీ సెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. శరీరంలో ఎక్కడైనా గాయం ఉంటే, పసుపు నీటితో స్నానం చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది. ఇది గాయాల వల్ల కలిగే మంటలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
Also Read: ఖరీదైన క్రీములు అవసరం లేదు.. వీటితో మెరిసే చర్మం
శరీరానికి విశ్రాంతినిస్తాయి:
పసుపులో అనేక రకాల ఔషధ మూలకాలు ఉన్నాయి. పసుపు నీటితో స్నానం చేయడం వల్ల శరీరానికి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పుల సమస్య పోతుంది . అంతే కాకుండా శరీరం రిలాక్స్ అవుతుంది. చాలా రోజుల పని చేసిన తర్వాత చాలా అలసిపోయినట్లు అనిపిస్తే, పసుపు నీటితో స్నానం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.