BigTV English

Warm Water: ఉదయాన్నే గోరువెచ్చని నీరు త్రాగుతున్నారా ?

Warm Water: ఉదయాన్నే గోరువెచ్చని నీరు త్రాగుతున్నారా ?

Warm Water: ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీళ్లు తాగాలని చాలా మంది సలహా ఇస్తుంటారు. నిజానికి, ఆయుర్వేదం ప్రకారం, ఉదయాన్నే వేడి నీటిని తాగడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. ఇది అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీళ్లు తాగడం మొదలుపెడితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చాలా మందికి తెలియదు.


అవును, ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. అంతే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మరి గోరువెచ్చని నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆయుర్వేదంలో కూడా వేడి నీటిని తాగడం కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. వేడినీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.


జీవక్రియను పెంచుతుంది:వేడి నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఫలితంగా శరీరం ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంతో పాటు బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.

మలబద్ధకం, అజీర్తిని తొలగిస్తుంది: వేడి నీరు జీర్ణవ్యవస్థను సక్రియం చేస్తుంది. అంతే కాకుండా మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది పేగు కండరాలను సడలించి,ప్రేగుల కదలికలో సహాయపడుతుంది.

విష పదార్థాలను తొలగిస్తుంది: వేడి నీరు శరీరం నుండి విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరాన్ని డిటాక్సిఫై కూడా చేస్తుంది.

బరువు తగ్గడం..
కేలరీలను బర్న్ చేస్తుంది: వేడి నీటిని తాగడం వల్ల శరీరంలోని జీవక్రియ సక్రియం అవుతుంది.ఇది కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.

ఆకలిని తగ్గిస్తుంది: గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇది మీరు తక్కువ తినేలా చేస్తుంది. అంతే కాకుండా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.

చర్మ సౌందర్యం కోసం..
చర్మాన్ని మెరుగుపరుస్తుంది- వేడి నీరు శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది చర్మానికి ఎక్కువ ఆక్సిజన్‌ను అందిస్తుంది. ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. అంతే కాకుండా మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. వేడి నీటిని తాగడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది. ఇది శరీరంలోని టాక్సిన్‌లను తొలగించి చర్మంపై మెరుపును తెస్తుంది.

Also Read: బరువు పెరగాలనుకుంటున్నారా ? అయితే ఇవి త్రాగండి

ఇతర ఆరోగ్య ప్రయోజనాలు:

రోగనిరోధక శక్తిని పెంచుతుంది- వేడి నీరు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతే కాకుండా వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది.
గొంతు నొప్పి నుండి ఉపశమనం – గోరువెచ్చని నీరు త్రాగడం వలన గొంతు నొప్పి నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా మీకు జలుబు ఉంటే గోరు వెచ్చని నీరు త్రాగడం అలవాటు చేసుకోండి.

ఒత్తిడిని తగ్గిస్తుంది- గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇది మీరు మరింత ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.

ఈ కారణాల వల్ల, ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం చాలా ప్రయోజనకరం.కానీ నీటిని చాలా వేడిగా చేయకూడదు. ఇలా చేసి తాగడం వల్ల సమస్యలు వస్తాయి. గోరువెచ్చని నీరు త్రాగడానికి ప్రయత్నించండి. ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×