Kannappa Movie : ఈ రోజు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా ‘కన్నప్ప’ (Kannappa) లీక్ మాత్రమే. మరోవైపు సాగుతున్న ‘గేమ్ ఛేంజర్’ టీజర్ హడావిడిని కూడా ఇది మర్చిపోయేలా చేసింది. ఈ సినిమాలో నుంచి ఎవ్వరూ ఊహించని విధంగా ప్రభాస్ (Prabhas) లుక్ లీక్ కావడం అందరికీ షాక్ ఇచ్చింది. అయితే తాజాగా నెలకొన్న పరిస్థితుల మధ్య ప్రభాస్ లుక్ తో పాటు ‘కన్నప్ప’ మూవీపై కూడా దారుణంగా ట్రోలింగ్ జరుగుతుంది.
నిజానికి ‘కన్నప్ప’ (Kannappa) సినిమాలో ఏదైనా మెయిన్ హైలెట్ ఉందా ? అంటే అది ప్రభాస్ స్పెషల్ రోల్ పోషించడమే. తన డ్రీం ప్రాజెక్టు ‘కన్నప్ప’ మూవీని మంచు విష్ణు (Manchu Vishnu) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు అన్నప్పటికీ ఈ సినిమాపై ఏ మాత్రం బజ్ క్రియేట్ కాలేదు. కానీ ప్రభాస్ కీలకపాత్ర పోషిస్తున్నాడు అనగానే ఒక్కసారిగా హైప్ మొదలైంది. ఈ సినిమాలో ప్రభాస్ ఎలాంటి పాత్ర చేయబోతున్నాడు? ఆయన రోల్ ఎలా ఉంటుంది ? అని ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సాధారణ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో సినిమాలో ఉన్న మెయిన్ హైలెట్ అయినా ప్రభాస్ లుక్ లీక్ అయ్యి నిండా ముంచింది కన్నప్ప టీంను.
ప్రభాస్ (Prabhas) నందీశ్వర పాత్రలో కనిపించబోతున్నాడు అని చాలా రోజుల నుంచి టాక్ నడుస్తోంది. వాస్తవానికి పేరుకే ఇందులో మంచు విష్ణు హీరో. కానీ ప్రభాస్ క్రేజ్ పైనే ఆధారపడి, సినిమా ఫలితంపై నమ్మకంతో ఉన్నారు. పైగా ప్రభాస్ నే ప్రచార కంటెంట్ గా వాడుకుంటున్నారు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా విషయంలో పూర్తిగా డిసప్పాయింట్ కావడానికి రెండు కారణాలు ఉన్నాయి.
అందులో ఒకటి ‘కన్నప్ప’ (Kannappa) లో ప్రభాస్ శివుడి పాత్ర చేస్తున్నాడని టాక్ వచ్చింది ముందు. కానీ అందరూ అనుకున్నట్టుగా ప్రభాస్ కాకుండా శివుడి పాత్రలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కనిపించి షాక్ ఇచ్చాడు. ఇక రెండవ రీజన్ విషయానికి వస్తే… పోనీలే ప్రభాస్ శివుడు కాకపోయినా పర్లేదు నందిగా అయిన అదరగొడతాడు, నందీశ్వర పాత్ర గురించి నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఉంటుందని అందరూ అనుకున్నారు. అలాగే లుక్, ప్రభాస్ ట్రాన్స్ఫర్మేషన్ పూర్తిగా డిఫరెంట్ గా ఉంటాయని ఊహించారు.
కానీ ఈరోజు లీకైన లుక్ చూస్తే అందులోనూ డిసప్పాయింట్మెంట్ తప్పలేదు. దీంతో ఇప్పటి నుంచే మూవీపై పెదవి విరుస్తున్నారు మూవీ లవర్స్. వాళ్ళను థియేటర్లకు నడిపించే ఓకే ఒక్క ఆయుధం ప్రభాస్ లుక్. దాన్ని ఆల్రెడీ సోషల్ మీడియాలో చూశారు కాబట్టి ఇక థియేటర్లలో చూడడానికి ఏముంది? అనే విధంగా కామెంట్స్ చేస్తున్నారు.
అంతేకాకుండా ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్ని లుక్స్ కూడా ట్రోలింగ్ కు గురయ్యాయి. తాజాగా ప్రభాస్ లుక్ పై కూడా ట్రోలింగ్ జరుగుతోంది. అయితే ఈ లీక్ ఇప్పుడు మంచు విష్ణు ఫ్యామిలీకి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. సినిమాకు సంబంధించి ప్రతి విషయంలో దారుణంగా నెగిటివ్ టాక్ వస్తుంటే అసలు ‘కన్నప్ప’ (Kannappa) టీంకు బిజినెస్ జరుగుతుందా అన్న అనుమానాలు నెలకొంటున్నాయి.
ఆశలన్నీ ప్రభాస్ (Kannappa) పైనే పెట్టి, ఆస్తులన్ని సినిమా పైనే పెట్టినప్పటికీ ఇప్పుడు లీక్ కారణంగా అది కూడా ట్రోల్ కంటెంట్ అయిపోవడంతో ఇలాంటి టైంలో మంచు ఫ్యామిలీని నమ్మి వచ్చే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు? సినిమాకు భారీ బడ్జెట్ పెడుతున్నారు సరే… కానీ వాళ్ళు అనుకున్నంత భారీ బిజినెస్ సినిమాకు అయ్యే అవకాశం ఉందా? అనేది కొత్తగా మొదలైన చర్చ.