Big Stories

Besan Flour for Skin: శనగపిండితో నలుగు.. ఇలా వాడితే మెరిసే చర్మం మీ సొంతం!

Besan Flour for Skin: శనగపిండితో నలుగుపెట్టుకుని స్నానం చేస్తే.. శరీరం మృదువుగా మారుతుంది. ఇప్పుడంటే కెమికల్స్ తో తయారు చేసిన సోప్ లు, బాడీ వాష్ లు వచ్చాయి గానీ.. పూర్వం శనగపిండినే స్నానానికి వాడేవారు. చర్మంపై పేరుకున్న మృతకణాలను, జిడ్డును తొలగించి.. కాంతివంతంగా చేస్తుంది. అంతే కాదు. ముడతలను తొలగించి.. మొటిమలను తగ్గిస్తుంది. సహజమైన స్క్రబ్ గా కూడా శనగపిండిని వాడుతారు.

- Advertisement -

శనగపిండి చర్మాన్ని శుభ్రంచేసి.. పొడిబారకుండా చేస్తుంది. ప్రతిరోజూ స్నానానికి శనగపిండిని వాడటం వల్ల మంచి ఫలితాలే కానీ.. చెడు ఫలితాలు ఉండవు.

- Advertisement -
టాన్ మాస్క్

మార్కెట్లో ఎన్నిరకాల ఇన్ స్టంట్ టాన్ రిమూవల్ క్రీమ్ లు, స్క్రబ్ లు ఉన్నా.. సహజ సిద్ధమైన శనగపిండి ముందు అవన్నీ దిగదుడుపే. పొడి చర్మం ఉన్నవారు శనగపిండిని పాలతో కలిపి అప్లై చేసి.. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఆయిలీ స్కిన్ ఉన్నవారైతే శనగపిండిని పెరుగులో కలిపి రాస్తే.. టాన్ తొలగుతుంది. ఇలా ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది.

Also Read: Hazelnut Benefits: డయాబెటిస్ ఉన్న వాళ్లు.. హాజెల్ నట్స్ తింటే ఎంత మంచిదో

మొటిమలను తగ్గించే శనగపిండి

చాలామందికి ముఖంపై మొటిమలు ఎక్కువగా వస్తుంటారు. ఇది అందాన్ని దెబ్బతీస్తుంది. చూడటానికి అందవిహీనంగా కనిపిస్తుంటారు. అందుకు కారణం ఎక్కువగా ఉత్పత్తయ్యే ఆయిల్. అలాంటివారు శనగపిండి మాస్క్ ను వాడితే మొటిమలు తగ్గుతాయి. శనగపిండికి నూనెను పీల్చుకునే గుణం ఉంది. కాబట్టి స్కిన్ నుంచి వచ్చే ఆయిల్స్ ను గ్రహించి.. మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖం మృదువుగా ఉంటుంది.

జిడ్డు చర్మాన్ని మృదువుగా చేయడమే కాదు.. పొడి చర్మానికి కూడా శనగపిండి మంచి ఔషధంలా పనిచేస్తుంది. పాలతో శనగపిండి రాసి.. అప్లై చేస్తే.. స్కిన్ మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది.

Also Read: Kashayam: వానాకాలంలో ఈ కషాయం తాగితే దగ్గు, జలుబు ఇట్టే మాయం

ప్రతిరోజూ మీ స్నానంలో శనగపిండిని భాగం చేసుకుంటే.. ముడతలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు. వృద్ధాప్య సంకేతాలు కనిపించవు. ఇందులో ఉండే యాండీ ఆక్సిడెంట్లు మీ అందాన్ని పెంచుతాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని కాపాడుతాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News